Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

తెలుగులో ఇన్‌స్టాగ్రామ్‌ పేరెంట్స్‌ గైడ్‌

హైదరాబాద్‌ : భారతదేశంలో యువతకు భద్రతనందించడంలో తమ నిబద్ధతను మరోమారు పునరుద్ఘాటిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా తెలుగు భాషలో పేరెంట్స్‌ గైడ్‌ను విడుదల చేసింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని తల్లిదండ్రులు అతి సులభంగా దీని ద్వారా పలు అంశాలను అభ్యసించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉన్న అన్ని భద్రతా ఫీచర్ల గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించడం ద్వారా యువత సురక్షితంగా ఉండటంలో సహాయపడటాన్ని లక్ష్యంగా ఈ గైడ్‌ చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి లభించిన ఉపయుక్తమైన వనరు పేరెంట్స్‌ గైడ్‌. ఎన్నో దేశాలలో ఇది లభ్యమవుతుంది. మారుతున్న డిజిటల్‌ వాతావరణాన్ని అత్యుత్తమంగా అర్థం చేసుకోవడంలో ఇది తల్లిదండ్రులకు సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img