Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

మౌరిటెక్‌లో 10 వేల ఉద్యోగాలు

హైదరాబాద్‌ : అంతర్జాతీయ ఎంటర్‌ప్రైజ్‌ ఐటీ పరిష్కారాల ప్రదాత, మౌరి టెక్‌ రాబోయే మూడు సంవత్సరాలలో 10వేల మంది నూతన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోనున్నట్లు వెల్లడిరచింది. వీటిలో తొలి 2వేల ఉద్యోగాలను 2021-2022 ఆర్ధిక సంవత్సరంలోనే నియమించుకోనుండగా, మొత్తమీద హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలోనే 3000 మందికి పైగా ఉద్యోగులను తీసుకోనున్నారు. దీర్ఘకాలంలో తమ వ్యాపారావకాశాలు గణనీయంగా వృద్ధి చెందనున్నాయనే అంచనాల నడుమ అదనపు సామర్థ్యపు అవసరాలకు అనుగుణంగా ఈ నియామకాలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలో 3500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆర్ధిక సంవత్సర ఆరంభంతో పోలిస్తే 20 శాతం వృద్ధి కనిపించింది. ఈ కంపెనీ అవార్డులనందుకున్న ఏఐ పరిష్కారాలను తమ ప్రతిష్టాత్మక బ్రాండ్‌ ఔరాసూట్‌ డాట్‌ ఏఐ కింద అందిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img