ముంబయి: దాదాపు రెండు సంవత్సరాలు కొవిడ్ మహమ్మారి తీసుకువచ్చిన విరామం తరువాత 5వ ఎడిషన్ యునిఫార్మ్ అండ్ గార్మెంట్స్ మాన్యుఫాక్చరర్స్ ఫెయిర్ 2022 మరోమారు తిరిగి వచ్చింది. సోలాపూర్ గార్మెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఎస్జీఎంఏ) తరపున కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ శాఖామాత్యులు నితిన్‌గడ్కరీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిరచారు. ఈ ఐదవ ఎడిషన్ ఫెయిర్ డిసెంబర్ 07, 08, 09 తేదీలలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగనుంది. గడ్కరీ మాట్లాడుతూ దేశం నుంచి మాత్రమే గాక ప్రపంచవ్యాప్తంగా తయారీదారులు ఈ ఫెయిర్‌లో పాల్గొనాల్సి ఉందన్నారు. యూనిఫార్మ్ విక్రయ రంగంలో ఉన్న లేదంటే ఈ రంగంలోకి అడుగిడదామనుకునే వారు తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదర్శన ఇదన్నారు.