గురుగ్రామ్: వినియోగదారులు తమ ఆరోగ్యాన్ని మరింత సమగ్రంగా నిర్వహించడంలో సహాయ పడటానికి వీలుగా సామ్సంగ్ హెల్త్ యాప్2నకు మెడికేషన్స్ ట్రాకింగ్ ఫీచర్1ని జోడిరచినట్లు భారతదేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్ ప్రకటించింది. ఈ ఫీచర్ వినియోగదారులకు వారికి సిఫారసు చేయబడిన లేదా ఓవర్ ది కౌంటర్ మందుల విధానాన్ని ట్రాక్ చేయడానికి వీలు కల్పించడమే కాకుండా ముఖ్యమైన వైద్య సమాచారం, చిట్కాలను కూడా అందిస్తుంది. రక్తపోటు, మధుమేహం, పిసిఒఎస్, పిసిఒడి, సకాలంలో మోతాదులు అవసరమయ్యే ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి చికిత్సలో ఉన్న వారికి మందులకు కట్టుబడి ఉండే స్థిరత్వాన్ని ట్రాక్ చేయడంలో ఈ ఫీచర్ సహాయపడుతుందని నోయిడాలోని సామ్సంగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ క్యుంగ్యున్ రూ అన్నారు.