Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

హార్లిక్స్‌ డయాబెటిస్‌ ప్లస్‌ విడుదల

హైదరాబాద్‌ : హార్లిక్స్‌ డయాబెటిస్‌ ప్లస్‌ను విడుదల చేయడం ద్వారా హార్లిక్స్‌ డయాబెటిస్‌ విభాగంలోకి ప్రవేశించింది. భారతదేశ జనాభాలో 7.3% మంది మధుమేహ బాధితులు ఉండగా, మరో 10.3% మంది ప్రీడయాబెటిక్‌గా గుర్తించబడి ముప్పుకు చేరువగా ఉన్నారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పోషకాహార లోపాలను పరిష్కరించేందుకు రూపొందించిన ప్రత్యేక బ్రాండ్‌ల సమితి హార్లిక్స్‌ ప్లస్‌ శ్రేణి, మధుమేహం విభాగంలోకి ప్రవేశించింది. హార్లిక్స్‌ విడుదల చేస్తున్న డయాబెటిస్‌ ప్లస్‌, భారతీయ పెద్దల కోసం రూపొందించబడిన పోషక పానీయం. ఇందులో అధిక ఫైబర్‌ (22% డ్యూయల్‌ బ్లెండ్‌ ఫైబర్‌) ఉంటుంది. పీచుతో కూడిన ఆహారం రక్తంలో గ్లూకోజ్‌, లిపిడ్లను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలో గుర్తించారు. హార్లిక్స్‌ డయాబెటిస్‌ ప్లస్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయి. 16 కీలకమైన పోషకాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్సోల్‌-2, న్యూట్రియోస్‌ ఉంటాయి. ఇవి కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img