Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘ది రష్మిక మీల్‌’ ను ప్రారంభించిన మెక్‌ డొనాల్డ్స్‌

హైదరాబాద్‌ : మెక్‌ డొనాల్డ్స్‌ ఇండియా (సౌత్‌ అండ్‌ వెస్ట్‌), సూపర్‌ స్టార్‌ రష్మిక మందన్న అభిమానులను అలరించేందుకు ఆమెతో కలసి ‘ది రష్మిక మీల్‌’ పేరిట ఒక ప్రత్యేక మీల్‌ను రూపొందించింది. రష్మిక అభిమానించే మెక్‌ స్పైసీ ఫ్రైడ్‌ చికెన్‌, మెక్‌ స్పైసీ చికెన్‌ బర్గర్‌, పిరి పిరి ఫ్రైస్‌, నింబూ ఫిజ్‌, మెక్‌ ఫ్లర్రీలు ఈ మీల్‌లో భాగంగా ఉంటాయి. ఎక్స్‌క్లూజివ్‌ ప్యాకేజింగ్‌గా ఇది లభ్యమవుతుంది. మనందరి లాగే రష్మిక తన మెక్‌ డొనాల్డ్స్‌ మీల్‌ ను రూపొందించుకోవడంలో తన సొంత శైలిని కలిగిఉంటారు. ఇప్పుడు ‘ది రష్మిక మీల్‌’ తో ఆమె అభిమానులు కూడా ఆమె మార్గంలో వెళ్లవచ్చు. ఆమె మొదట మెక్‌ స్పైసీ ఫ్రైడ్‌ చికెన్‌ను బైట్‌ చేయడాన్ని ఇష్టపడుతారు. ఆ తరువాత పిరి పిరి ఫ్రైస్‌ను మెక్‌ స్పైసీ చికెన్‌ బర్గర్‌తో కలిపి తీసుకుంటారు. దాంతో అది మరింత స్పైసీగా తయారవుతుంది. ఆ తరువాత ఆమె రిఫ్రెషింగ్‌ నింబూ ఫిజ్‌ను గుటకేస్తారు. క్రీమీ మెక్‌ ఫ్లర్రీతో స్వీట్‌ నోట్‌తో భోజనం ముగిస్తారు. రష్మిక తనదైన శైలిలో తన మీల్‌ను ఆనందించడాన్ని చూపించేలా ఒక టీవీసీని కూడా మెక్‌ డొనాల్డ్స్‌ ఇండియా ఆవిష్కరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img