Monday, May 6, 2024
Monday, May 6, 2024

కాంగ్రెస్ పాలనలోనే పేదల అభివృద్ధి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై. మధుసూదన్ రెడ్డి

విశాలాంధ్ర :ఉరవకొండ( అనంతపురం జిల్లా)

 కాంగ్రెస్ పార్టీ పాలనలోనే పేదల అభివృద్ధి సాధ్యమని ప్రజలందరూ కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు  ఓట్లు వేసి గెలిపించాలని ఉరవకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై. మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వజ్రకరూరు మండల కేంద్రంలో ఆయన ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎలాంటి నిధులు  విడుదల చేయలేదన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు దిష్టిబొమ్మలుగా మారారని తెలిపారు.  నిధులు లేకపోవడం వల్ల  పారిశుద్ధ పనులు కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొన్నది అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే  ప్రత్యేకంగా గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారిస్తానని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి  హంద్రీనీవా కాలును తీసుకొస్తే  ప్రస్తుత పాలకులు  ఒక్క ఎకరాకి కూడా సాగునీటిని అందించలేకపోయారన్నారు. హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీ పనులను కూడా పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీటిని అందించేందుకు తనవంతు  కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం మిరప పంట సాగు చేసిన రైతులు  ధరలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా రైతుల పక్షాన తాను పోరాటం చేస్తానన్నారు. గత పది సంవత్సరాల పరిపాలనలో ఉన్న తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి పార్టీలు రెండు కూడా విఫలం చెందైన్నారు. రెండు పార్టీలు కూడా బిజెపికి స్నేహపూర్వకంగా కొనసాగుతున్నారని విభజన హామీలను సాధించి రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదన్నారు. కేంద్రం మరియు  రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అములు చేయనున్నదని తెలిపారు. విభజన హామీలతో పాటు ప్రతి మహిళకు లక్ష రూపాయల నగదు, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ప్రతి సంవత్సరం 2.20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు  కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య నాలుగు వేల రూపాయల పింఛన్లు వికలాంగులకు 6వేలు అందివ్వడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా కూడా  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ సిపిఐ, సిపిఎం పార్టీల కూటమి అభ్యర్థిగా తనను గెలిపించాలని  ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్  సిపిఐ,సిపిఎం పార్టీల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img