Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

సజావుగా జరిగిన ఏపీఆర్జేసీ అండ్ డిసి సెట్-2024 పరీక్షలు.. డీఈఓ మీనాక్షి దేవి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని పలు పరీక్షా కేంద్రాలలో గురువారం నాడు ఉదయం ఏపీఆర్జేసీ పరీక్షలు, అదేవిధంగా మధ్యాహ్నం డిసి సెట్ 2024 పరీక్షలు సజావుగా నిర్వహించడం జరిగిందని డీఈవో మీనాక్షి దేవి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రెండు పరీక్షలు లను ఎనిమిది సెంటర్లలో ఐదవ, ఆరవ, ఏడవ, ఎనిమిదవ, ఇంటర్మీడియట్ తరగతుల అడ్మిషన్ కొరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తము విద్యార్థులు 1000 734 మంది కు గాను 1558 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగిందని, 176 మంది గైర్హాజరు కావడం జరిగిందన్నారు. అదేవిధంగా 8 సెంటర్లలో ఐదవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు రాసిన పరీక్షల్లో మొత్తం 1303 మందికి గాను 1134 మంది హాజరుకాగా 169 గైర హాజరు కావడం జరిగిందన్నారు. ఈ పరీక్షలను పరీక్షా కేంద్రాలు అయిన కొత్తపేట బాలుర ఉన్నత పాఠశాల,బిఎస్సార్ మున్సిపల్ బాలుర అండ్ బాలికల ఉన్నత పాఠశాల, కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, కాకతీయ విద్యా నికేతన్ ని ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఉషోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, జడ్పీ హైస్కూల్ లలో నిర్వహించడం జరిగిందన్నారు. తదుపరి డీఈవో మీనాక్షి దేవి అన్ని పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, ప్రశాంతంగా, సజావుగా పరీక్షలు నిర్వహించే విధంగా తమ విధులను నిర్వహించడం జరిగిందని తెలిపారు. రూట్ ఆఫీసర్లుగా రాజేశ్వరి దేవి, జిల్లా కోఆర్డినేటర్ గా బి శ్రీనివాసరావు లు ఉన్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img