Friday, October 7, 2022
Friday, October 7, 2022

10వేల ఆఫర్లతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌

హైదరాబాద్‌ : హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తన ఫెస్టివ్‌ ట్రీట్స్‌ 3.0 క్యాంపెయిన్‌లో భాగంగా 10,000కు పైగా ఆఫర్లతో భారతీయ హృదయాల్లో వెలుగులు నింపేందుకు వస్తోంది. ఇది 2020తో పోల్చితే 10 రెట్లు ఎక్కువ. ఈ ఏడాది కార్డులు, రుణాలు, సులభమైన ఇఎంఐలతో ఫెస్టివ్‌ ట్రీట్‌లను 10,000కన్నా ఎక్కువ ఆఫర్లను బ్యాంకు అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఈ ఏడాది ఫెస్టివ్‌ ట్రీట్‌ల థీమ్‌ ‘‘కరో హర్‌ దిల్‌ రోషన్‌’’. ఇది మనం చేసే చిన్న పనుల ద్వారా ఇతరుల జీవితాల్లో చక్కని మార్పు తీసుకు వస్తుందన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. బ్యాంకు తన శాఖలు, ఏటీఎంలు, స్టోర్‌లు/వెబ్‌సైట్‌లతో భాగస్వామ్యం, హైపర్‌ లోకల్‌ ఫోకస్‌ ఉన్న డిజిటల్‌ మీడియా క్యాంపెయిన్ల ద్వారా ప్రతి భారతీయుడిని చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రీమియం మొబైల్‌ ఫోన్‌లపై క్యాష్‌బ్యాక్‌లు, నో కాస్ట్‌ ఇఎంఐలు. ఐఫోన్‌ 13పై రూ.6,000 క్యాష్‌బ్యాక్‌తోపాటు ఎన్నో ఆఫర్లు ఇవ్వడానికి సిద్ధమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img