ముంబయి: ప్రముఖ స్మార్ట్ఫోన్, స్మార్ట్ టీవీ బ్రాండ్ అయిన షియోమీ ఇండియా, భారతదేశంలో తొమ్మిది విజయవంతమైన సంవత్సరాల సంబరాలను జరుపుకోవడం పట్ల ఎంతగానో గర్విస్తోంది. అనేక సంవత్సరాలుగా, తన వినూత్నమైన ఉత్పత్తులతో, సామాజిక బాధ్యత పట్ల నిబద్ధతతో మిలియన్ల కొద్దీ వినియోగదారుల మనసులను గెలుచుకుంటూ బ్రాండు ఇంటింటి పేరుగా మారింది. 9 సంవత్సరాలు నిండిన తన వార్షికోత్సవ సంబరాల సందర్భంగా సమాజంపై తాను ఏర్పరచిన ప్రభావాన్ని ఎత్తి చూపుతూ షియోమీ ఇండియా తన నివేదికను విడుదల చేసింది. షియోమీ ఇండియా ఒక ఉద్దేశ్యాన్ని నెరవేర్చే బ్రాండుగా ఉంటూ వస్తోంది. విద్య, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణం అనే తన దృష్టిసారింపు అంశాల ద్వారా సామాజిక అభివృద్ధి దిశగా సుస్థిరంగా పని చేసింది.