Monday, April 22, 2024
Monday, April 22, 2024

ఎన్‌టీఏ జేఈఈలో ఫిట్‌జీ విజయపరంపర

న్యూఢల్లీ : నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈం) మెయిన్‌ 2024 సెషన్‌ 1 ఫలితాలలో భారతదేశ ప్రీమియర్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫిట్‌జీ విద్యార్థులు అద్భుతమైన ఫీట్‌ను సాధించారు. మొత్తంమీద 8 మంది విద్యార్థులు 100 ఎన్‌టీఏ స్కోర్‌ను సాధించారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు ఫిట్‌జీ లాంగ్‌ టర్మ్‌ క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌ నుండి ముగ్గురు విద్యార్థులు ఫిట్‌జీ నాన్‌-క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌ నుండి జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌ 1 ఫలితాల్లో అత్యుత్తమ స్కోర్‌ సాధించారు. మొత్తం ఏడుగురు ఫిట్‌జీ దీర్ఘకాలిక క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌లు విద్యార్థులు తమ సంబంధిత రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఢల్లీ (2 స్టేట్‌ టాపర్‌), హర్యానా, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలో ఈ ఘనత సాధించారు. విద్యార్థుల ఏకాగ్రత, అంకితభావం, వారి కృషికి ఫలితమిదని ఫిట్‌జీ గ్రూప్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎల్‌ త్రిఖా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img