Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

హైదరాబాద్‌లో గరిష్ఠ స్థాయిలో ఇళ్ల విక్రయాలు : జెఎల్‌ఎల్‌ రీసెర్చి

విశాలాంధ్ర/హైదరాబాద్‌: హైదరాబాద్‌లో 2008 రెండవ త్రైమాసికం అనంతరం ప్రస్తుతం రికార్డు స్థాయిలో నివాసాల విక్రయాలు నమోదయ్యాయని రియల్‌ ఎస్టేట్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ జెఎల్‌ఎల్‌ రీసెర్చ్‌ వెల్లడిరచింది. అలాగే 2008 తర్వాత అత్యధిక త్రైమాసిక లాంచ్‌లు కూడా ఇప్పుడే జరిగాయి. పలు ప్రముఖ డెవలపర్‌లు నగరంలోని పశ్చిమ శివారు ప్రాంతాల్లో తమ వ్యాపార లావాదేవీలతో అడుగు జాడలను విస్తరించడంతో 2022 రెండవ త్రైమాసికంలో కొత్త లాంచ్‌లు 24% వృద్ధి చెందాయి. ఈ విక్రయాలు 38% పెరిగాయి. హైదరాబాద్‌లో 2021 మొదటి అర్థ సంవత్సరం)తో పోల్చితే 2022లోని ఆరు నెలల్లో విక్రయాలు 39% పెరిగాయి. 2008 రెండో త్రైమాసికంలో హైదరాబాద్‌ అత్యధిక నివాస విక్రయాలను చూసిందని జెఎల్‌ఎల్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ పట్నాయక్‌ వివరించారు. హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్‌ మార్కెట్‌ 2022 రెండవ త్రైమాసికంలో 53,000 యూనిట్ల విక్రయాలను నమోదు చేయగా, ఇది టాప్‌ 7 నగరాల్లో 2021 రెండవ త్రైమాసికంతో పోల్చితే ఏడాది నుంచి ఏడాదికి 171% వృద్ధి చెందిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img