న్యూదిల్లీ : చార్జింగ్ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈవీ కార్ల కస్టమర్ల కోసం ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హ్యుందాయ్ అల్ట్రా
ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 11 అల్ట్రాఫాస్ట్ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. వీటిలో హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, అహ్మదాబాద్, గురుగ్రామ్, బెంగళూరులలో అల్ట్రా
ఫాస్ట్ డీసీ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటితోపాటు జాతీయ రహదారులైన దిల్లీచండీగఢ్, దిల్లీ
జైపూర్, హైదరాబాద్విజయవాడ, ముంబై
సూరత్, ముంబైనాసిక్ రోడ్లపై ఐదు అల్ట్రా
ఫాస్ట్ డీసీ చార్జింగ్ స్టేషన్లను కూడా నెలకొల్పింది. ఈ చార్జింగ్ స్టేషన్లన్నీ రోజంతా తెరిచే ఉంటాయి. ఒక్కో స్టేషన్లో డీసీ 150 కిలోవాట్లు, డీసీ 60 కిలోవాట్లు, డీసీ 30 కిలోవాట్ల సామర్థ్యంతో మూడు చార్జింగ్ పాయింట్లు ఉంటాయి.