గురుగ్రామ్: శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన ప్రతిష్టాత్మకమైన గెలాక్సీ ఎస్ 24 సిరీస్ తాజాగా నుండి భారతదేశంలో విక్రయించబడుతోంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ గెలాక్సీ ఎస్24 అల్ట్రా , గెలాక్సీ ఎస్24G, గెలాక్సీ ఎస్24 స్మార్ట్ఫోన్లు లైవ్ ట్రాన్స్‌లేట్, ఇంటర్ప్రెటర్, చాట్ అసిస్ట్, నోట్ అసిస్ట్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ ఫీచర్లతో వస్తాయి. శాంసంగ్ కీబోర్డ్‌లో నిర్మించబడిన ఏఐ హిందీతో సహా 13 భాషల్లో వాస్తవ సమయంలో సందేశాలను అనువదించగలదు. కారులో, ఆండ్రాయిడ్ ఆటో స్వయంచాలకంగా ఇన్కమింగ్ సందేశాలను సంగ్రహిస్తుంది. సంబంధిత ప్రత్యుత్తరాలు, చర్యలను సూచిస్తుంది. గెలాక్సీ ఎస్ 24 సిరీస్ భారతదేశంలోని శాంసంగ్ నోయిడా ఫ్యాక్టరీలో తయారు చేయబడుతోంది. గెలాక్సీ ఎస్ 24 సిరీస్ కోసం రికార్డ్ ప్రీ-బుకింగ్‌లను శాంసంగ్ పొందింది.