ముంబయి: అత్యంత ఆసక్తి గా ఎదురుచూస్తున్న తమ రెండవ తరం ప్రధాన స్మార్ట్‌ఫోన్ నథిక్ ఫోన్ (2)ను విడుదల చేసినట్లు నథింగ్ బుధవారం వెల్లడిరచింది. స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మరింత శ్రద్ధగా ఉండేలా చేస్తూ ఈ ఫోన్ (2) రూపొందించారు, ఫోన్ (2) వెనుక భాగంలో కొత్త గ్లిఫ్ ఇంటర్ఫేస్ను పరిచయం చేశారు. వినియోగదారులకు కీలక సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకునే అవకాశం అందించటం ద్వారా స్క్రీన్ ను ఎక్కువగా చూడటం తగ్గించడానికి వీలు కల్పిస్తుంది. ఇది పునరుద్దరించబడిన నథింగ్ ఓఎస్ 2.0ని కూడా కలిగి ఉంది. టాప్-ఆఫ్-ది-లైన్ స్నాప్‌డ్రాగన్ 8G జెన్1 మొబైల్ ప్లాట్‌ఫారమ్ ఆధారితమైన ఫోన్ (2) ఇప్పటి వరకు, నథింగ్ అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది. దీనిలో జీవితపు తరహా ఫోటోగ్రఫీ కోసం అధునాతన అల్గారిథమ్‌లతో శక్తివంతమైన 50ఎంపీ డ్యూయల్ వెనుక కెమెరా ఉంది.