Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

అపోలో హాస్పిటల్‌లో వెర్టిగో అండ్‌ బ్యాలెన్స్‌ డిజార్డర్‌ క్లినిక్‌

హైదరాబాద్‌: వెర్టిగో చికిత్సకు భారతదేశంలోనే మార్గదర్శకంగా ఉంటూ అపోలో హైదరాబాద్‌లోని తన ఆసుపత్రిలో వెర్టిగో అండ్‌ బ్యాలెన్స్‌ డిజార్డర్‌ క్లినిక్‌ను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడని సమస్యల్లో ఒకటిగా ఉన్న ఈ వ్యాధికి, దేశంలోనే వెర్టిగోను గుర్తించే, చికిత్సను అందించే విధానంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చేందుకు ఈ క్లినిక్‌ ఉద్దేశించబడిరది. వెర్టిగో అనగా వ్యక్తి తాను లేదా తన చుట్టూ ఉన్న పరిసరాలు కదులుతున్నట్లుగా లేదా తిరుగుతున్నట్లుగా అనుభూతి చెందే పరిస్థితి, ఈ వ్యాధికి గురైన వారి రోజువారీ కార్యకలాపాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. వెర్టిగో ఒక ఎపిసోడ్‌ కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉండవచ్చు. కొన్నిసార్లు గంటలు లేదా వారాల పాటు కూడా కొనసాగవచ్చు. అందువలన అపోలో హాస్పిటల్స్‌లో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన వైద్యుల ఆధ్వర్యంలో వెర్టిగోకు సమర్థవంతంగా చికిత్స చేయడం చాలా కీలకం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img