Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు..

లోక్‌సభ ఎన్నికల వేళ చమురు కంపెనీలు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించాయి. 19 కేజీల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.19 తగ్గిస్తున్నట్లు ఆయిల్‌ కంపెనీలు తెలిపాయి. పెంచిన ధరలు మే 1 నుంచే అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. అయితే ఇళ్లలో వంటకు వినియోగించే డొమెస్టిక్‌ సిలిండర్‌ల ధరలను తగ్గించలేదు.19 కిలోల వాణిజ్య ఇండేన్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో రూ.1,764.50 ఉండగా.. తాజాగా రూ.19 తగ్గడంతో రూ.1,745.50కి చేరింది. కోల్‌కతాలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1879 నుంచి రూ.1860కి తగ్గింది. హైదరాబాద్‌లో కూడా రూ.1994.50కు దిగివచ్చింది. గత నెలలోనూ 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.30.50 తగ్గింది. ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50గా ఉంది. ఉజ్వల స్కీమ్ కింద కేవలం రూ.502కే లభిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img