బెంగళూరు: ప్రైమ్ డే 2023 సమీపించడంతో, అమేజాన్ ఇండియా ‘చిన్నారి అన్వేషకులు’ కోసం బొమ్మలు, ఇంకా ఎన్నో వాటి పై కూర్పు చేసిన జాబితా విడుదల చేసింది. ఇష్టపడిన బొమ్మలు, పుస్తకాలు, ఇంకా ఎన్నో వాటిని శిశువులు, చిన్న పిల్లలు, యుక్త వయస్సులో ఉన్న వారు, కౌమార దశలో ఉన్న వారు ఎంచుకోవచ్చని సిఫారసు చేస్తోంది. తమ కొనుగోళ్లు కోసం ప్రణాళిక చేయడంలో కస్టమర్స్‌కు సహాయపడటం, ప్రైమ్ డేకి ముందు ఉత్తమమైన డీల్స్, ఉత్పత్తులను కనుగొనడమే జాబితా లక్ష్యం. జాబితాలో బొమ్మలు, పుస్తకాలు కోసం బహుమతులు ఇవ్వవలసిన వస్తువుల గురించి ఆలోచనలు, గేమ్స్, స్టికర్స్, రస్కిన్ బాండ్ కథ ‘ద బ్లూ అంబరెల్లా‘తో పాటు డీఐవై కిట్స్ వంటి గేమ్స్ ఉంటాయి. లెగో, హస్ బ్రో, మట్టెల్ వంటి ప్రసిద్ధి చెందిన బొమ్మల బ్రాండ్స్‌లో విస్తృత శ్రేణి ఉత్పత్తుల జాబితా ఉంటుంది. కస్టమర్స్ తమ అమేజాన్ యాప్‌ను వినియోగించి ఉత్పత్తిని స్కాన్ చేసి తమ షాపింగ్ కార్ట్‌లో పడవేసే విధంగా జాబితాలో ప్రతి పేజీ క్యూఆర్ కోడ్ సెట్ చేసినట్లు అమేజాన్ ఇండియా డైరక్టర్ రాజర్షి గుయిన్ తెలిపారు.