Saturday, October 26, 2024
Saturday, October 26, 2024

బాదం పప్పులతో దీపావళి వేడుకలు

ముంబయి: దీపావళి పండుగ సమయంలో ఎక్కువగా చక్కెరతో కూడిన విందులు, వేయించిన స్నాక్స్‌, పిండి పదార్ధాలు అధికంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకుటారు. దీనివల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. అందుకే బాదం వంటి పోషకమైన ఎంపికలను చేసుకోవటం ఆరోగ్యగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. బాదంపప్పులో ప్రోటీన్‌, కాల్షియం, జింక్‌, డైటరీ ఫైబర్‌, మెగ్నీషియం వంటి 15 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మొత్తం ఆరోగ్యంను కాపాడుతూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలోని అధిక ఫైబర్‌, ప్రొటీన్‌ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడతాయి, అతిగా తినాలనే కోరికను అరికడుతుంది. ప్రోటీన్‌ అధికంగా ఉండటం వల్ల బాదం కండరాల పెరుగుదల, నిర్వహణకు తోడ్పడుతుంది. ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తీసుకోవడం వల్ల అవి కార్బోహైడ్రేట్‌ ఆహారాల ప్రభావాన్ని తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చని న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి తదితరులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img