Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

ఎల్లోర శిల్పంను మించిన అందం

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమె 2018 సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చి అదే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాల తర్వాత ఈమె నటించిన రెండు సినిమాలు గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఒకటి షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్దంగా ఉంది. యంగ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచిన సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో పిక్స్ రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉన్నాయి. స్టార్ కిడ్స్ కొందరు కాస్త పద్దతిగా కనిపించాలని భావిస్తూ ఉంటారు. కాని సారా అలీ ఖాన్ మాత్రం తన అందంను ఏమాత్రం తగ్గించి చూపించేందుకు సిద్దం అవ్వదు. తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్ ను షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫొటోలు హాట్ గా అందరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పిక్ లో ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ ను ఎల్లోర శిల్పం మాదిరిగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఎంత స్కిన్ షో చేసినా.. ఎంతటి హాట్ ఔట్ ఫిట్ లో ఉన్నా కూడా పెద్దగా నచ్చరు. కాని సారా అలీ ఖాన్ ఫిజిక్ మరియు ఆమె బ్యూటీతో యూత్ ఆడియన్స్ కు కిక్కెక్కిస్తుంది. ఆమె ఈ ఫోజ్ లో అద్బుమైన ఎల్లోర శిల్పం మాదిరిగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ ఈ ఫొటోలతో మరింతగా ఇమేజ్ సొంతం చేసుకుంటుంది. ఆకట్టుకున్న ఈ అమ్మడి ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి అందంతో ముందు ముందు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంటుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img