Friday, December 2, 2022
Friday, December 2, 2022

కత్తి మహేశ్‌ కంటికి తీవ్ర గాయం, ఐసీయూలో చికిత్స

ప్రముఖ సినీ నటుడు కత్తి మహేశ్‌ ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆయన తల, ఎడమ కంటికి తీవ్ర గాయమైందని, ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూ ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

కాగా ఈ రోజు తెల్లావారుజామున కత్తి మహేశ్‌ తన ఇన్నోవా కారులో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రోడ్డు గుండా ప్రయాణిస్తుండగా చంద్రశేఖరపురం వద్ద ముందు వెళుతున్న లారీని వేగంగా ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద విషయంపై సమాచారం అందడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఇక ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను సాయంత్రంలోగా వైద్యులు వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img