Friday, December 2, 2022
Friday, December 2, 2022

కుంద్రా లైంగిక వేధింపుల్లో హైదరాబాద్ అమ్మాయి..!

ఒక సాధారణ సాలువాల వ్యాపారి నీలిచిత్రాల వ్యాపారిగా మారిన వైనం ప్రస్తుతం ప్రకంపనాలురేపుతోంది. బాలీవుడ్ నిర్మాత .. బిజినెస్ మేన్ రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల వ్యవహారం సంచలనంగా మారింది. అతడిపై పలువురు నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాదీ అమ్మాయి.. నటి షెర్లిన్ చోప్రా అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ప్రస్తుతం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రాకు జూలై 28 న దిగువ కోర్టు బెయిల్ నిరాకరించింది. పలువురు నటీమణులు రాజ్ కుంద్రా యాప్ హాట్ షాట్ లకు వ్యతిరేకంగా బహిరంగంగా బయటకు వచ్చారు. దానిపై అశ్లీల చిత్రాలను సృష్టించడం ప్రచురించడంపై అభియోగాలు మోపబడ్డాయి. షెర్లిన్ చోప్రా అతనిపై లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు చేశారు. ఇక రాజ్ కుంద్రా యాప్ వీడియోల బిజినెస్ పైనా షెర్లీన్ తీవ్ర ఆరోపణలు చేసారు. అశ్లీల కేసుకు సంబంధించి తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ముంబై క్రైమ్ బ్రాంచ్ కు హాజరైనట్లు తెలిసింది.
లైంగిక వేధింపుల కేసులో ఆమె 2021 ఏప్రిల్లో రాజ్పై ఎఫ్.ఐ.ఆర్ జారీ అయ్యింది. ఇండియన్ పీనల్ కోడ్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తన ఫిర్యాదులో షెర్లిన్ 2019 ప్రారంభంలో రాజ్ కుంద్రా బిజినెస్ మేనేజర్ తనను పిలిచి వీడియోల వ్యాపారం గురించి చెప్పారని.. 27 మార్చి 2019 న జరిగిన వ్యాపార సమావేశం తరువాత ఒక తీవ్ర పదజాలంపై వాదన కారణంగా రాజ్ తన ఇంటి వద్ద అనూహ్యంగా ప్రవర్తించాడని షెర్లిన్ పేర్కొంది. ప్రతిఘటించినప్పటికీ రాజ్ తనను ముద్దు పెట్టుకునేందుకు బలవంతం చేశాడని షెర్లిన్ ఆరోపించింది. వివాహితుడితో సంబంధం పెట్టుకోవద్దని… అలాంటి బిజినెస్ మేన్ తో వ్యాపారాన్ని సాగించకూడదని తాను కోరుకుందట. శిల్పాశెట్టితో జీవితం ఒత్తిడి మయం కాంప్లికేటెడ్ అని ఎక్కువ సేపు ఇంట్లోనే ఉండాలని తను పట్టుబడుతుందని కూడా రాజ్ తనకు చెప్పినట్టు షెర్లిన్ వెల్లడించింది.
చాక్లెట్ వీడియో వివాదం:
అప్పట్లోనే షెర్లిన్ పై ఓ చాక్లెట్ వీడియోను అంధేరీలోని ఓ హోటల్ లో చిత్రీకరించగా.. షూట్ చేసే సమయంలో సిగ్గు బిడియం పక్కనబెట్టి హాలీవుడ్ మోడల్ లా నగ్నంగా చెలరేగాలని రాజ్ కుంద్రా ఆర్మ్స్ ప్రైమ్ క్రియేటివ్ హెడ్ బలవంతం చేసినట్లు షెర్లిన్ వెల్లడించింది. ఈ సంస్థపై అప్పట్లో పీఎస్ లో ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదైంది. అందులో తన పేరు ఉండడంతో విచారణకు హాజరుకావాలని ఈ నెల 26వ తేదీన నోటీసులు పంపారు. అయితే రాజ్ కుంద్రాలానే తాను అరెస్టవుతాననే భయంతో.. ముందస్తు బెయిల్ కోసం బాంబే హైకోర్టును షెర్లిన్ చోప్రా సంప్రదించింది. అరెస్టు తగదని తాజాగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ లోతుగా సాగుతోంది. రాజ్ కుంద్రా బాధితురాళ్ల జాబితాలో పలువురు మోడల్స్ కథానాయికల పేర్లు వెల్లడయ్యాయి. పూనమ్ పాండే .. సోఫియా హయత్ లాంటి హాట్ గాళ్స్ అతడిపై రకరకాల ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img