Friday, October 7, 2022
Friday, October 7, 2022

కోలుకుంటున్న సాయిధర్మతేజ

హైదరాబాద్‌ : హీరో సాయి ధర్మతేజ కోలుకుంటున్నాడని, ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని అపోలో వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయులోనే చికిత్స కొనసాగు తోందని, చికిత్సకు తేజ్‌ బాగా స్పందిస్తున్నాడని వారు తెలియ జేశారు. సోమవారం సాయంత్రానికి ఆయనకు వెంటిలేటర్‌ తొలగించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. డాక్టర్‌ అలోక్‌ రంజన్‌ నేతృత్వంలోని వైద్య బృందం సాయి ధర్మతేజకు చికిత్స అందిస్తున్నారు. చేస్తున్నారు. ప్రస్తుతం తేజ్‌ దగ్గరకు డాక్టర్లు ఎవ్వరినీ అనుమతించడం లేదని, కుటుంబ సభ్యులకు మాత్రం వీడియోలో చూపిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img