Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

చరణ్‌ నాన్‌స్టాప్‌ డ్యాన్స్‌… శంకర్‌ ఫిదా

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి వారసుడిగా సినీ పరిశ్రమలోకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్‌ చరణ్‌. ‘రంగస్థలం’లో సౌండ్‌ ఇంజినీర్‌ పాత్రతో ప్రేక్షకులను మాయ చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్‌ టైటిల్‌గా ‘ఆర్‌సీ 15’ అని వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ‘ఆర్‌సీ 15’ కోసం భారీ స్థాయిలో ఓ సాంగ్‌ను షూట్‌ చేస్తున్నారు. ఈ పాటలో చెర్రీ అదిరిపోయే స్టెప్స్‌ వేసి డైరెక్టర్‌ శంకర్‌ను ఫిదా చేశారు. పాటలో భాగంగా రామ్‌ చరణ్‌ నాన్‌స్టాప్‌గా 80 సెకన్‌ల పాటు డ్యాన్స్‌ చేశారు. ఈ స్టెప్స్‌ అన్ని కూడా మొదటి టేక్‌లోనే ఒకే అయ్యాయి. రామ్‌ చరణ్‌ చేసిన డ్యాన్స్‌ను చూసి సెట్‌లో ఉన్న వారందరు సర్‌ప్రైజ్‌ అయ్యారు. ‘ఆర్‌సీ 15’ షూటింగ్‌ ప్రస్తుతం కర్నూలులో జరుగుతోంది. అంతకు ముందు చార్మినార్‌, కొండారెడ్డి బురుజు వంటి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ తండ్రి, కొడుకులుగా కనిపించనున్నారు. తండ్రి పాత్రకు అంజలి జోడీగా కనిపించనున్నారు. కొడుకు పాత్రకు కియారా అద్వానీ జంటగా కనిపిస్తారు. టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుందని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img