Friday, May 31, 2024
Friday, May 31, 2024

జనవరి 7న ఆర్‌ఆర్‌ఆర్‌

టాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ 2022 జనవరి 7వ తేదీన విడుదల కానున్నది. ఈ మేరకు శనివారంనాడు చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించడంతోపాటు దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందు తున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో జూనియర్‌ ఎన్టీయార్‌, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ టాప్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ కూడా ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాలతో నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ అగ్రశ్రేణి పాన్‌ఇండియా మూవీగా విడుదల కాబోతున్నది. ఇండియాతోపాటు దాదాపు 25 దేశాల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. ఇప్పటివరకు ఒక పాటను కూడా విడుదల చేశారు. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img