Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

నాలుగు కథల ‘ఇదే మాకథ’


హైదరాబాద్‌ : నాలుగు కథలతో కూడిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తు న్నారు. గురు పవన్‌ దర్శకత్వం వహిస్తు న్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబో తున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ టీజర్‌ని హీరో విక్టరీ వెంకటేష్‌ విడుదల చేశారు. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్‌ రైడర్ల కథ ఇది. తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమవుతారు. ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో సాగే సంభాషణలు అలరిస్తున్నాయి. పృథ్వీ చేసిన కామెడీ విశేషంగా అలరిస్తుంది. రైడర్లుగా శ్రీకాంత్‌, భూమిక, సుమంత్‌, తాన్యా ఒదిగిపోయారు. మరి ఎవరి కథ ఏంటి? ఎందుకు వీరంతా ఇంటిని వదిలి వచ్చేశారు? అనుకున్న గమ్యం చేరుకున్నారా? తదితర విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై జి. మహేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img