Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

నిర్మాత మహేశ్‌ కోనేరు మృతి

విశాఖపట్నం : టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, జూనియర్‌ ఎన్టీఆర్‌ మేనేజర్‌ మహేశ్‌ కోనేరు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన చాలాకాలంగా ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌కు పీఆర్‌ఓగా పనిచేస్తున్నారు. నిర్మాతగానూ కల్యాణ్‌ రామ్‌ హీరోగా ‘118’, సత్యదేవ్‌తో ‘తిమ్మరుసు’, కీర్తి సురేశ్‌తో ‘మిస్‌ ఇండియా’ సినిమాలు నిర్మిం చారు. కాగా మహేశ్‌ కోనేరు అక్టోబర్‌ 12న గుండెపోటుతో హఠా న్మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్‌ ఎంతో ఎమో షనల్‌ అవుతూ ట్వీట్‌ చేశారు. ‘‘బరువెక్కిన హృదయంతో చెబు తున్నాను..నా ఆప్త మిత్రుడు మహేశ్‌ కోనేరు ఇకలేరు. నాకు మాటలు రావడం లేదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపు తున్నాను’’ అని ఎన్టీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే కల్యాణ్‌రామ్‌ కూడా ట్వీట్‌ చేశారు. ‘‘నా స్నేహితుడు, కుటుంబంలో ఒకరు, శ్రేయో భిలాషి అయిన వ్యక్తి మహేశ్‌ కోనేరు ఇక లేరు. మాకు వెన్నుముక లాంటి వారు. ఆయన లేని లోటు నాకు, పరిశ్రమకి తీర్చనిది’ అని కల్యాణ్‌ రామ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img