Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

పంచ్‌ డైలాగులతో బాలయ్య ‘అన్‌ స్టాపబుల్‌’ టాక్‌ షో ప్రోమో

హైదరాబాద్‌ : అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆహా యాప్‌ లో ఆయన హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న ‘అన్‌ స్టాపబుల్‌’ కార్యక్రమం తొలి ఎపిసోడ్‌ నవంబరు 4న దీపావళి సందర్భంగా ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణపై ఆహా ఓటీటీ యాప్‌ నుంచి ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో లింకును బాలయ్య తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘‘మాటల్లో ఫిల్టర్‌ ఉండదు, సరదాలో స్టాప్‌ ఉండదు… సై అంటే సై, నై అంటే నై… దెబ్బకు థింకింగ్‌ మారిపోవాల!’’ అంటూ తనదైన శైలిలో బాలయ్య చెప్పిన డైలాగులు ప్రోమోలో ఆకట్టుకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img