Friday, October 7, 2022
Friday, October 7, 2022

ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌కు బండ్ల గణేష్‌ గుడ్‌బై

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో కొత్త పోరుకు తెరలేచింది. ఇప్పటివరకు ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా ఉన్న నిర్మాత బండ్ల గణేశ్‌.. ఆ ప్యానల్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ ఏడాది జరిగే ‘మా’ ఎన్నికల్లో ప్రధానకార్యదర్శి పదవి కోసం పోటీలోకి దిగుతున్నట్లు ప్రకటిం చారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. అలాగే జీవితా రాజశేఖర్‌ రావడం నాకిష్టం లేదని పేర్కొన్నారు. ‘ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌లోకి జీవితా రాజశేఖర్‌ రావడం నాకిష్టం లేదు. నాకు ఎంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీని ఆమె ఎన్నో సార్లు కించపరిచారు. అందుకే నేను ఈ ప్యానల్‌ నుంచి తప్పుకొంటున్నాను. ఆమెపై జనరల్‌ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగుతున్నాను’ అని బండ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు.
బండ్ల గణేశ్‌తో విభేదాలు లేవు : బండ్ల గణేష్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని నటి జీవితా రాజశేఖర్‌ స్పష్టం చేశారు. ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న జీవిత ఓ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘మా’లో సభ్యులుగా ఉన్న వారు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్నారు. బండ్ల గణేష్‌ కూడా ‘మా’ అభివృద్ధి కోసం కృషి చేయాలనుకుంటున్నారు.. అందుకే ఆయన ఎన్నికల బరిలోకి దిగారు.. అంతేకానీ, తనకు వ్యతిరేకంగానో లేదా నెగటివిటీతోనే ఆయన పోటీ చేస్తున్నారని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో నేను గెలిచినా, ఓడినా సరే ‘మా’ కోసం పనిచేస్తా’ అని జీవితా రాజశేఖర్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img