Sunday, November 27, 2022
Sunday, November 27, 2022

బుల్లి తెరపై కూడా వకీల్ సాబ్

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతటి స్టార్ హీరో సినిమా ఉన్నా కూడా ఆయన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఇక రికార్డుల మోత మోగుతుంది. అలాంటి పవర్ స్టార్ చాలా గ్యాప్ తర్వాత నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. అసలు ఈ మూవీ రికార్డులు ఎలా ఉండేవో కానీ ఈ సినిమా కేవలం 14 రోజులు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించారు. అలా కాకుండా సినిమా మొత్తాన్ని థియేటర్లలో ప్రదర్శిస్తే రికార్డులు ఎలా ఉండేవో అని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిందీ లో మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ మూవీకి రిమేక్ గా వకీల్ సాబ్ ను తీసుకు వచ్చాడు. అయినా కూడా ఇక్కడ పవన్ అభిమానులు ఆ మూవీని భారీ హిట్ చేశారు. ఈ మూవీకి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించగా… బడా నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. థియేటర్లు మూత పడిన తర్వాత ఈ మూవీ అమోజాన్ ప్రైమ్ లో విడుదలయింది. అక్కడ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత ఈ మూవీని గత వారం జీ తెలుగులో ప్రసారం చేశారు. ఈ చిత్ర ప్రసార సమయంలో ఇండియా జట్టు క్రికెట్ మ్యాచ్ ఉంది. అటువంటి సమయంలో జీ తెలుగులో ప్రసారం చేయడం అంటే కాస్త సాహస నిర్ణయం అంటూ టాక్ వినిపించింది. టీఆర్పీ రేటింగ్ ఎలా ఉంటుందో అని పవర్ స్టార్ అభిమానులతో పాటు పలువురు ఇండస్ర్టీ వర్గాల వారు కూడా ఆందోళన చెందారు. పవర్ స్టార్ హవా అక్కడ కూడా మామూలుగా లేదు. ఈ చిత్రం అక్కడ కూడా దుమ్మరేపింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ.. దాదాపు 19.12 రేటింగ్ సాధించి ఔరా అని అనిపించింది. ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాయర్ గా కనిపించగా… అందాల ముద్దు గుమ్మలు నివేదా థామస్ అనన్యా నాగళ్ల అంజలి లీడ్ రోల్స్ లో నటించారు. బాలీవుడ్ చూసిన మూవీయే అయినప్పటికీ పవర్ స్టార్ మానియాతో ఈ మూవీకి అనుకోని విజయాన్ని కట్టబెట్టారు ఆయన అభిమానులు. ఇక మరో బ్యూటీ తమిళ స్టార్ నటుడు కమల్ హాసన్ కూతరు శృతి హాసన్ ఈ మూవీలో పవన్ కు జోడిగా నటించింది. ఇంతకు మునుపే గబ్బర్ సింగ్ మూవీలో కూడా వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. ఆ మూవీలో ఈ జంటకు మంచి మార్కులు పడ్డాయి. వరుస విజయాలతో జైత్ర యాత్ర కొనసాగిస్తున్న యువ సంగీత దర్శకుడు ఎస్. ఎస్. థమన్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చాడు. ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభిమాని కూడా కావడం మరో విశేషం. ఇలా వచ్చిన వకీల్ సాబ్ అందరి అంచనాలను అందుకుంటూ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా బుల్లి తెరపై కూడా సూపర్ హిట్ ను దక్కించుకుని వకీల్ సాల్ కు తిరుగు లేదు అన్నట్లుగా నిరూపించుకుంది. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కాని కరోనా కారణంగా సినిమా ఆలస్యం అయ్యింది. అయినా కూడా అభిమానులు ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img