Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

రజనీ ‘పెద్దన్న’ ట్రైలర్‌ వచ్చేసింది

హైదరాబాద్‌ : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే. రజనీ సినిమా ఎప్పుడూ వస్తుందా అని ఎదురు చూసే అభిమానులు ఆయనకు దేశ విదేశాల్లో ఉన్నారు. అయితే శివ కుమార్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త తమిళ చిత్రం ‘అన్నాత్తే’. ఈ చిత్రం తెలుగులో పెద్దన్నగా రానుంది. అయితే ఈ మూవీ తమిళ ట్రైలర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన రావడమే కాకుండా మూవీపై అంచనాలు పెంచింది. కాగా తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. అందులో ఆయన మాస్‌ డైలాగులు అదిరిపోయాయి. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్స్‌ విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img