Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

సుకుమార్‌ దర్శకత్వంలో మరోసారి ఎన్టీఆర్‌?

హైదరాబాద్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కి ఎక్కువ సమ యం కేటాయించడం, అనుకున్న సమయానికి కొరటాల ప్రాజెక్టు సెట్స్‌ పైకి వెళ్లకపోవడం వల్ల ఈ సారి ఎన్టీఆర్‌కీ, అభిమానులకు మధ్య దూరం పెరిగింది. దాంతో ఇకపై తన నుంచి వరుస సినిమాలు థియేటర్స్‌ కి వెళ్లేలా ఎన్టీఆర్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడట. ఆయన తాజా చిత్రంగా కొరటాలతో చేస్తున్న సినిమా సెట్స్‌ పై ఉంది. కెరియర్‌ పరంగా ఇది ఆయనకి 30వ సినిమా. 31వ సినిమాను ఆయన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది కూడా పాన్‌ ఇండియా స్థాయిలోనే రూపొందనుంది. ఇక 32వ సినిమాగా బాలీవుడ్‌ మూవీ ‘వార్‌ 2’ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ‘వార్‌ 2’ సెట్స్‌ పైకి వెళ్లడం ఆలస్యమైతే, సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలోనే ఎన్టీఆర్‌ కి సుకుమార్‌ ఒక కథను వినిపించడం… ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిపోయాయి. ‘నాన్నకు ప్రేమతో’ తరువాత వీరిద్దరూ చేయనున్న సినిమా ఇదే. ఈ లోగా విజయ్‌ దేవరకొండతో అనుకున్న ప్రాజెక్టును సుకుమార్‌ పూర్తిచేస్తాడని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img