Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

గోపీచంద్‌ కొత్త సినిమా ‘భీమా’

హైదరాబాద్‌: ‘రామబాణం’ చిత్రం తర్వాత హీరో గోపీచంద్‌ చేస్తున్న చిత్రానికి ‘భీమా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో రూపు దిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ నెం 14గా… నిర్మాత కెకె రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. గోపీచంద్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇక విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో గోపీచంద్‌ పోలీసు అధికారిగా కనిపిస్తున్నారు. ఇందులో గోపీచంద్‌ ఆవేశపూరితంగా చూస్తూన్నాడు. బ్యాక్‌ గ్రౌండ్‌లో ఒక ఎద్దును కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ లుక్‌, టైటిల్‌ ట్రెండ్‌ అవుతోంది. కన్నడలో విజయవంతమైన చిత్రాలను అందించిన హర్ష… ఈ భారీ బడ్జెట్‌ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలు, ఇతర అంశాలతో కూడిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని నిర్మాత చెబుతున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. హై-ఆక్టేన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, ‘కెజియఫ్‌’ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img