Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

‘వేదాళం’ కంటే భోళాశంకర్‌ ఓ మెట్టుపైనే: డడ్లీ

హైదరాబాద్‌: బాలీవుడ్‌లో పలు సూపర్‌ హిట్‌ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన డడ్లీ… ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్‌’తో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 11న విడుదల కానుంది. సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, దిల్‌వాలే వంటి హిట్‌ చిత్రాలకు డీవోపీగా పని చేసిన డడ్లీ భోళా శంకర్‌ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిరచాడు. దర్శకుడు మెహర్‌ రమేష్‌, తాను పదేళ్లుగా మంచి స్నేహితులమని చెప్పాడు. మెహర్‌ ఈ ప్రాజెక్ట్‌ గురించి చెప్పగానే చాలా థ్రిల్‌ అయ్యానని తెలిపాడు. చిరంజీవి ఓ ఎన్‌సైక్లోపీడియా అని, ఆయన క్రమశిక్షణ, సమయపాలనను ఎవ్వరూ మ్యాచ్‌ చేయలేరన్నాడు. తమిళ హిట్‌ సినిమా ‘వేదాళం’కి రీమేక్‌ అయినప్పటికీ మెగాస్టార్‌ స్టయిల్‌కి తగ్గట్టు భోళాలో చాలా మార్పులు చేసినట్టు తెలిపాడు. భోళా శంకర్‌.. వేదాళం కంటే ఓ మెట్టుపైనే ఉంటుందని చెప్పి సినిమాపై ఆసక్తిని మరింత పెంచాడు. ఈ సినిమాలో చిరు సరసన తమన్నా హీరోయిన్‌గా నటించగా.. కీర్తి సురేశ్‌ చిరు చెల్లెలు పాత్ర పోషించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img