Monday, September 25, 2023
Monday, September 25, 2023

28న ‘జైలర్‌’ పాట విడుదల

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌కు ‘రోబో’ తర్వాత సరైన హిట్టు లేదు. దీంతో ‘జైలర్‌’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రజనీ నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్‌’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుతూనే ఉన్నాయి. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ నుండి కాస్ట్‌ రివీల్‌ వరకు ప్రతీది ప్రేక్షకులలో ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల రిలీజైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల్లో చిత్రంపై అంచనాలు పెరిగాయి. పదేళ్లకు పైగా సరైన హిట్టులేని రజనీకి జైలర్‌ మంచి కమ్‌బ్యాక్‌ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుండగా… ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కావాలా పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మొదట్లో జానాలకు అంతగా ఎక్కలేదు కానీ… ఇప్పుడు బాగానే ఆదరిస్తున్నారు. తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్‌ అప్‌డేట్‌ను మేకర్స్‌ వెల్లడిరచారు. శుక్రవారం ఈ పాటను హైదరాబాద్‌లోని సీఎమ్‌ఆర్‌ కాలేజ్‌లో తమన్నా లాంచ్‌ చేయబోతున్నట్లు ప్రకటించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌ లాల్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, సునీల్‌, ప్రియాంక అరుళ్‌మోహన్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img