Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

జారుడుబండ నాలుకలు

ఇంతవరకు 17 సార్లు లోకసభకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తయితే 18వ లోకసభకు జరుగుతున్న ఎన్నికలు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి మతాన్ని వినియోగించుకోవడం చాలా కాలంగా సాగుతున్నదే. మత ప్రసక్తి సాధారణంగా నర్మ గర్భంగా సాగేది. ఇప్పుడు మతం ఆధారంగానే బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తోంది. ఎన్నికలలో విజయం సాధించడానికి మతాన్ని ఉపయోగించు కోవడానికి అడ్వాణీ శ్రీకారం చుడ్తే మోదీ ప్రచారం అంతటినీ మత మయం చేసేశారు. గత పదేళ్ల పాలనలో చేసిన మంచేమిటో చెప్పుకోవడానికి ఏమీ మిగలని మోదీ ఎన్నికల ఒక్కో దశ గడుస్తున్న కొద్దీ ప్రచారంలో మతం పాళ్లు పెంచుతున్నారు. అబద్ధాలనే ఆశ్రయిస్తున్నారు. ఇది రెండు రకాలుగా సాగుతోంది. ఒకటి: ముస్లింల మీద విద్వేషం పెంచడం. రెండు: ముస్లింల నుంచి ముప్పు ఉందని హిందువులలో భయం పాతుకు పోయేలా చేయడం. ఇటీవలి కాలంలో అనేక మంది మోదీ భక్తులు ఆయనను అవతార పురుషుడిని చేసేశారు. 2018 డిసెంబర్‌ లోనే మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి అవధూత్‌ వాఫ్‌ు మోదీని విష్ణుమూర్తి 11వ అవతారం అని పొగిడి తరించారు. రామ జన్మ భూమి ట్రస్ట్‌ కార్యదర్శి 2023 డిసెంబర్‌లో మరో మారు విష్ణు మూర్తి అవతారం అన్నారు. ప్రసిద్ధ నటి కంగనా రౌనత్‌ కొంచెం భిన్నంగా మోదీని శ్రీరాముడి అవతారం అన్నారు. జై భగవాన్‌ గోయల్‌ మోదీని ఈ కాలపు శివాజీగా అభివర్ణించారు. ఆయన ఏకంగా ‘‘ఆజ్‌ కె శివాజి: నరేంద్ర మోదీ’’ అని ఓ గ్రంథమే రాసేశారు. తరచుగా టీవీ చానళ్లలో కనిపించి మోదీని పొగడడంతో పునీతుడైపోయిన సంవిద్‌ పాత్ర అన్ని హద్దులు చెరిపేసి పూరీ జగన్నథ స్వామి మోదీ భక్తుడు అనేశారు. ఆ తరవాత ఆయన నోరు జారానని సంజాయిషీ ఇచ్చుకున్నారు. పాప ప్రక్షళనార్థం మూడు రోజులు ఉపవాస దీక్ష కూడా చేపట్టారు. టీవీ చానళ్లలో సంవిద్‌ పాత్ర మాటలు విన్న వారికి ఆయన ఒక్కొక్క మాట వింటూ ఉంటే రోత పుడ్తుంది. ఆయన ప్రస్తుతం ఒరిస్సా నుంచి లోకసభకు పోటీ చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఒరిస్సాలో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ కోణార్క దేవాలయానికి మోదీవల్లే విశ్వ వ్యాప్తంగా ప్రచారం వచ్చిందంటున్నారు. ప్రపంచ నాయకులందరూ మోదీతో కరచాలనం చేయడానికి ఉత్సాహ పడ్తున్నారని అమిత్‌ షా అన్నారు. మోదీ నేపథ్యంలో కోణార్క దేవాలయం ఉంటుంది చూడండి అని తన వాదనకు అమిత్‌ షా మరో అబద్ధాన్ని జోడిరచారు. పూరీకి 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోణార్క దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించారు. అప్పటి నుంచి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు కోణార్క సూర్య దేవాలయం సందర్శిస్తూనే ఉన్నారు. మరి అప్పుడు మోదీ ఎక్కడున్నారు. పూరీ జగన్నథ స్వామి రథ యాత్ర చాలా ప్రసిద్ధమైంది. 1984లోనే యునెస్కో కోణార్క దేవాలయాన్ని ప్రపంచ వారసత్వంగా సంపదగా ప్రకటించింది. అప్పటికి మోదీ మహా అయితే ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్త కావచ్చు.
సొంత వ్యక్తిత్వం, అస్తిత్వం లేని వారు మోదీని నోరారా పొగిడినా, ఆయనను దైవాంశ సంభూతుడని కీర్తించినా ఆశ్చర్య పడనక్కర్లేదు. కానీ స్వయంగా మోదీకే ఆ అభిప్రాయం బలంగా ఉంది. ‘‘మా అమ్మ జీవించినంతకాలం ఆమె నన్ను కన్నది అనుకున్నాను. కాని ఆమె మరణించిన తరవాత ఈ దేశోద్ధరణకు పరమాత్ముడే నన్ను పంపించాడు అని భావిస్తున్నాను’’ అని మోదీ స్వయంగా చెప్పుకున్నారు. ఆత్మ స్తుతి, పర నిందలో అద్వితీయుడైన మోదీ ఇలా భావించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ ఎన్నికలలో ప్రజలు కనక మోదీని ఓడిస్తే ఓటర్లు పరమాత్ముడు పంపించిన తనను తన కర్తవ్యం పూర్తి చేయకుండా అడ్డు తగిలారు అన్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఈ ఎన్నికలలో అసలు సమస్యలు ప్రస్తావనకు రాకుండా మోదీ సకల జాగ్రత్తలూ తీసుకున్నారు. అసత్యాలు, కట్టుకథలు, కువ్యాఖ్యానాల ఆధారంగా ‘‘అలసట లేకుండా’’ ఎన్నికల ప్రచార ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. మరోవేపు ప్రతిపక్ష పార్టీలతో కూడిన ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన జనం రోజువారీ సమస్యలను లేవనెత్తుతుండడంవల్ల వాటికి సమాధానం చెప్పలేక మోదీ సతమతమవుతున్నారు. ఆయన ఎన్నికల ప్రసంగాలన్నీ అబద్ధాల కుళ్లు కంపు కొడ్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, కేంద్ర మంత్రివర్గం పార్లమెంటుకు బాధ్యత వహించే విధానానికి స్వస్తి చెప్పి మంత్రులను, బీజేపీ అధికార ప్రతినిధులను, తన భక్తులను ఆ మాటకొస్తే మొత్తం బీజేపీని ఏకేశ్వరోపాసకులుగా మార్చేశారు. ఈ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా దేశవాసులందరినీ అదే రీతిలో ఏకేశ్వరోపాసకులను చేయాలనుకుంటున్నారు. తానను దైవాంశ సంభూతుడిగా ఇతరులు కీర్తిస్తూ ఉంటే పరవశించి పోవడానికి అలవాటు పడిన మోదీ ఆ పొగడ్తల ధాటికి నిజంగానే తాను దైవాంశ సంభూతుడిని అని నమ్ముతున్నారు. ఆత్మానందం అనుభవిస్తున్నారు. వ్యక్తి ఆరాధనను ప్రోత్సహించిన నాయకులు మన దేశంలోనే కాదు, విశ్వవ్యాప్తంగా అనేక మంది కనిపిస్తారు. ఇందిరా గాంధీతో సహా అలాంటి వారందరూ ఏదో ఒక సమయంలో ప్రజాగ్రహానికి గురి కావలసి వచ్చింది. ముసోలినీని కొట్టి చంపారు. హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోవలసి వచ్చింది. ఓటమి అంగీకరించని మోదీకి చివరకు ఏమవుతుందో తెలియదు. ఇవన్నీ గమనిస్తే 18వ లోకసభకు జరుగుతున్న ఎన్నికలు మిగతా 17 లోకసభ ఎన్నికలకన్నా ఎంత భిన్నమైనవో అర్థం అవుతుంది. సర్వం మోదీ మయం చేయాలన్న తపన అంతిమంగా బెడిసికొట్టక తప్పదు. అప్పుడు మోదీ కీర్తిగానంలో ముణిగి తేలిన జారుడుబండ నాలుక ఉన్న సంవిద్‌ పాత్ర, అమిత్‌ షాతో పాటు తక్కిన వారందరూ తల ఎక్కడ దాచుకుంటారో చూడాలి. 74 ఏళ్లుగా మన రాజ్యాంగం అమలులో ఉంది. రాజ్యాంగాన్ని పక్క దారి పట్టించిన సందర్భాలు మోదీ కన్నా ముందు కూడా అనేకం ఉండొచ్చు. కానీ రాజ్యాంగానికి ముప్పు ఉంది అన్న భావన గత అయిదారేళ్ల నుంచి ఎక్కువైంది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్న ధ్యాస పెరిగింది. సామాన్య పౌరులు సైతం ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఈ ఎన్నికలు బీజేపీకి, ఇతర పక్షాలకు మధ్య జరగడం లేదు. మోదీకి ప్రజానీకానికి మధ్య జరుగుతున్నాయి. ప్రజాగ్రహం ఉరకలెత్తితే ఎంతటి వారికైనా ప్రజలు గుణపాఠం నేర్పి తీరుతారు. ‘‘నా విష్ణుః పృథ్వీ పతిః’’ అన్న భ్రమలోపడి మురిసిపోయే ఎవరికైనా ఓటు ద్వారా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఆ విషయం మోదీకి, ఆయన భక్తులకు అర్థం కాకపోవచ్చు. కానీ జనానికి బాగానే అర్థం అవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img