Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

బడ్జెట్‌ కాదు మోదీ స్తోత్రం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ఆరోసారి లోకసభలో బడ్జెట్‌ ప్రతిపాదించారు. అయితే త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి గనక ఇది అనామతు బడ్జెటే. ఇందులో ప్రధానమైన ఆర్థిక విధానాలు, కొత్త పథకాలు, వివిధ రంగాలకు పెట్టుబడులు పెంచడం, తగ్గించడం లాంటి అంశాలు ఉంటాయని ఆశించడం కుదరదు. ఎన్నికలు ఏప్రిల్‌లో జరగొచ్చు. కానీ బడ్జెట్‌ ప్రతిపాదించి ఆమోదించకపోతే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఖజానాలో ఎంత డబ్బున్నా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీలుండదు. అందుకని అనామతు బడ్జెట్‌ ప్రతిపాదనా సంప్రదాయం అమలులోకి వచ్చింది. ఈ బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్‌ ఏ వర్గానికీ పన్నులు పెంచలేదు లేదా తగ్గించలేదు. అంటే వచ్చే జులైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రతిపాదించే దాకా పన్నుల పెరుగుదల లేదా రాయితీ ఉండే అవకాశం లేదు. అయితే నిర్మలా సీతారామన్‌ ఆశలు రేకిత్తించడంలో మాత్రం వెనుకంజ వేయలేదు. మన ఆర్థిక వ్యవస్థ, దేశాభివృద్ధి సత్వరంగా సాగుతోందని మోదీ పదే పదే వల్లిస్తున్న మంత్రాన్నే నిర్మలా సీతారామన్‌ కూడా పుణికి పుచ్చుకున్నారు. దేశం సంపూర్ణంగా అభివృద్ధి కావడానికి 2047 దాకా వేచి ఉండాల్సిందేనని స్పష్టంగా చెప్పేశారు. అందుకని అభివృద్ధి కోసం దేశవాసులు పెద్దగా ఆశలు పెట్టుకోవలసిన అగత్యం లేదు. మోదీ ఈ మధ్య కాలంలో ర్యాలీల్లోనూ, రోడ్‌షోలలోనూ తమ ప్రభుత్వం మహిళల, యువత, అన్నదాతల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఊదరగొడ్తున్నారు. సరిగ్గా నిర్మలా సీతారామన్‌ కూడా ఈ వర్గాల అభివృద్ధికే తమ బడ్జెట్‌ ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. అనామతు బడ్జెట్‌ వల్ల పరిమితులు ఉన్నప్పటికీ ఈ మూడు వర్గాల ప్రజలకు ఈ బడ్జెట్‌లో దోచి పెట్టింది ఏమీ లేదు. జులైలో ప్రతిపాదించే పూర్తి స్థాయి బడ్జెట్‌ లో వీరి కోసం అనుసరించే విధానాలు వెల్లడిస్తామని మాత్రం నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అంటే వచ్చే ఎన్నికలలోనూ తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమా ‘‘నేను మళ్లీ వస్తాను’’ అన్న మాటల్లో కనిపిస్తోంది. ఆమె బడ్జెట్‌ ప్రసంగంలో అడుగడుగునా కీర్తి గానాలాపన విరామం లేకుండా వినిపించింది. ఒక రకంగా ఇది అనామతు బడ్జెట్‌ కూడా కాదు మోదీ స్తోత్రం అనుకోవాలి. ఉద్యోగాలివ్వలేదు, ధరలూ అదుపు చేయలేదు. కానీ 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని నిర్మలా సీతారామన్‌ చెప్తున్నారు. ఏ మంత్రం ప్రయోగించడం వల్ల వీరు పేదరికం నుంచి బయట పడ్డారో మాత్రం చెప్పలేదు గాక చెప్పలేదు. అనామతు బడ్జెట్‌ పేరుతో ఆమె చేసిందల్లా గత పదేళ్ల కాలం నుంచి కొనసాగుతున్న మోదీ ప్రభుత్వాన్ని స్తుతించడమే. నిర్మలా సీతారామన్‌ తన ఏలుబడిని అదే పనిగా పొగుడుతూ ఉంటే మోదీ బల్లలు చరుస్తూ కూర్చున్నారు. ఈ బడ్జెట్‌ ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్‌కు మోదీ నూటికి నూరు మార్కులు వేసేశారు. పెట్టుబడి వ్యయం 11 శాతం పెరిగి మొత్తం రూ. 11,11,111కి పెరిగిందని ఆర్థిక మంత్రి చెప్తూ ఉంటే మోదీ మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ అంకెలైతే విన సొంపుగా ఉన్నాయి.
ఇది ఆర్థిక మంత్రి తన ప్రతిభను ప్రదర్శించలేని అనామతు బడ్జెట్‌ కనక ఆమె బడ్జెట్‌ ప్రసంగం గతంలో ప్రవేశ పెట్టిన అయిదు బడ్జెట్‌ ప్రసంగాలలోకెల్లా చిన్నది. చిన్న ప్రసంగం చేసినందుకు సంతోషించాల్సిందే. అనామతు బడ్జెట్‌ కనక ఆర్థిక మంత్రి జమా ఖర్చులు వివరించడానికే పరిమితమైంది. ఏమైతేనేం ఈ తాత్కాలిక బడ్జెట్‌లో కూడా ఓటర్లను ఆకట్టుకోగలిగే అంశాలన్నీ పొందుపరచడం మాత్రం నిర్మలా సీతారామన్‌ మరిచి పోలేదు. అన్ని ప్రభుత్వాలు పేదలను ఉద్ధరించడానికే పాటు పడ్తున్నామని చెప్పుకుంటాయి. నిర్మలా సీతారామన్‌ అదే పని చేశారు. పేదలను అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేస్తామన్న మోదీ మాటను ఆర్థికమంత్రి ఈ బడ్జెట్‌ ప్రసంగంలోనూ దొర్లించారు. ప్రత్యక్ష నగదు బదిలీ విధానంవల్ల అద్భుతాలు జరిగిపోయాయని ఆమె అన్నారు. దీని ద్వారా లబ్ధిదారులకు అందవలసిన డబ్బు మధ్యలో దారి మళ్లకుండా నిరోధించగలిగిన మాట వాస్తవమే కావచ్చు. కానీ దీనివల్ల ఆర్థికాభివృద్ధి ఏ మేరకు జరిగిందన్న ప్రశ్నకు సమాధానమైతే రాదు. ఒక వేళ మనదీ సర్కారు చెప్తున్నట్టుగా ఆర్థికాభివృద్ధి జాంబవంతుని అంగలతో పరుగు పెడ్తూ ఉంటే 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేయవలసిన అవసరం ఎందుకుంటుంది? జనాభాలో చాలా మందికి తమ ఆహారాన్ని కొనే స్తోమత లేకపోవడం అభివృద్ధి సాధిస్తున్నామన్నది కేవలం నినాద ప్రాయమైందని రుజువు చేయడానికే ఉపకరిస్తుంది. మహిళలలే జనాభాలో సగం కనక మహిళలకు ఇళ్లిస్తాం, మరొకటి ఇస్తాం అని చెప్పడం మహిళల ఓట్ల కోసం వేసే గాలంగానే మిగిలిపోతుంది. మహిళలకు ఇచ్చే ఇళ్లు కల్పించే సదుపాయాలు మొత్తం కుటుంబానికి వర్తిస్తాయిగదా! మాటిమాటికి మహిళల పేరెత్తడం అంటే వారి ఓట్లు సంపాదించాలన్న రాజకీయ లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తుంది. యువత ఉపాధి గురించి నిర్మలా సీతారామన్‌ ఏ ప్రస్తావనా చేయలేదు. నిజానికి ఇది ప్రస్తుతం ప్రధాన సమస్యల్లో ఒకటి. రైతులు మళ్లీ ఉద్యమబాట పట్టక తప్పడం లేదు. ఆర్థిక మంత్రి మోదీని పొగడడం అనివార్యం కావచ్చు. తన ఘనత గురించి ఆమె ఒక్క మాట చెప్పుకోకపోవడానికి మోదీ కట్టడి కారణం కావచ్చు. మోదీ లాగే ఆర్థిక మంత్రి కూడా గత ప్రభుత్వాలను నిందించడం మరిచి పోలేదు. అరవై నెలలు ఇవ్వండి చాలు అద్భుతాలు చేసి చూపిస్తా అని చెప్పిన మోదీ 120 నెలల్లో సాధించిందేమిటో బహుశా నిర్మలా సీతారామన్‌కు అంతుబట్టి ఉండదు. గత ప్రభుత్వాల నిరాకం మీద శ్వేత పత్రం వెలువరిస్తారట. మోదీ పాలనపై కూడా అలాంటి శ్వేత పత్రం విడుదల చేస్తే అసలు బండారం బయట పడుతుంది. మహిళోద్ధరణకు ‘‘ముమ్మారు తలాఖ్‌’’ను చట్ట విరుద్ధం చేశామంటున్నారు. అదే సమయంలో ముస్లింలలో పురుషులను నేరస్థులను చేసి తమ విద్వేష రాజకీయాలను ప్రదర్శించారు. చట్ట సభల్లో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించడమూ తమ ఘనతే అంటున్నారు. కాని అది అమలు కావడానికి మరో దశాబ్దం కన్నా ఎక్కువ కాలం ఆగాల్సిందేగా! రైల్వేలలో మూడు ఆర్థిక కారిడార్లు ఏర్పాటు చేస్తారట. 40,000 మామూలు బోగీలను వందే భారత్‌ బోగీల స్థాయికి తీసుకువస్తారట. అంటే సంపన్నుల ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తారన్న మాట. రైల్వే శాఖను ఉద్ధరించేటట్టయితే బడ్జెట్‌ ప్రతిపాదించగానే రైల్వేలతో సంబంధం ఉన్న అనేక కంపెనీల వాటాలు స్టాక్‌ మార్కెట్‌లో ఎందుకు బోల్తా పడ్డట్టు? అమలులో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనా పథకాల, ఆధునీకరణ ఊసే ఆర్థిక మంత్రి ప్రసంగంలో ఎక్కడా లేదు. జనం ఆశించింది మరిన్ని రైళ్లు, మరిన్ని బోగీలు, ఇతర సదుపాయాలు. ఇవేవీ అనామతు బడ్జెట్‌లో లేవు. ఈ బడ్జెట్‌ ప్రసంగం ఎన్నికలకోసం ఉద్దేశించింది. ఇది కేవలం రాజకీయ పత్రమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img