Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అంధ భక్తిలో సమిధలు

ఆశారాం బాపు, డేరా సచ్చా బాబా రాం రహీం సింగ్‌, బాబా భోలే బాబా, బాబా రాజీందర్‌ కాలియా – ఇలా ఏ పేరు తలుచుకున్నా ఒకే రకమైన లీలలు కనిపిస్తాయి. వీరి లీలలకు భక్తులు మోసపోతూనే ఉంటారు. మంగళవారం భోలే బాబా
హాత్రస్‌ లో నిర్వహించిన సత్సంగంలో తొక్కిసలాట వల్ల కనీసం 121 మంది మరణించారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. ఆ రోజు ఏదో విపరీత సంఘటన జరగబోతోందని భోలే బాబా ముందే చెప్పారంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ దుర్ఘటనపై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించింది. అలహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి బ్రిజేశ్‌ శ్రీవాత్సవ నేతృత్వంలో ముగ్గురు సభ్యులుగల దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా ఈ దర్యాప్తు సంఘం నివేదిక అందజేయాలని యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆదేశించింది. యోగీ ఆదిత్యనాథ్‌ ఈ తొక్కిసలాట వెనక ఏదో కుట్ర ఉండొచ్చునేమోనన్న అనుమానం వ్యక్తం చేయడం ద్వారా దర్యాప్తు ఏ దిశలో సాగాలో నిర్దేశించారు. ఈ సత్సంగానికి దాదాపు రెండున్నర లక్షల మంది హాజరయ్యారు. ఇంత మంది హాజరయ్యే చోట ఎలాంటి భద్రతా వ్యవస్థ ఉండాలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పట్టించుకున్నట్టు లేదు. దానికి తోడు బాబా నిర్వహించే సత్సంగం ఆవరణలో సకల వ్యవహారాలను ఆయన వెంట ఉండే భద్రతా సిబ్బందే చూసుకుంటారట. పోలీసులను లోపలికి అనుమతించరట. అది బాబా నియమం కావచ్చు. కానీ అపరిమిత సంఖ్యలో జనం హాజరవుతారనుకున్న సందర్భాలలో భద్రతా అంశాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం అనుమతి ఎలా మంజూరు చేస్తుందో అంతుపట్టదు. బాబా దైవిక శక్తి, ఆయన భద్రతా వ్యవస్థ మీద ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి అపారమైన విశ్వాసం ఎలా కుదిరిందో తెలియదు. ఇలాంటి బాబాలందరికీ అపారమైన రాజకీయ పలుకుబడి ఉంటుందని అనేకసార్లు రుజువైంది. బాబా భోలేనాథ్‌కు సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ మద్దతు ఉందని, ఆయన ఒకసారి సత్సంగంలో పాల్గొని బాబా కీర్తిగానం చేశారని అంటున్నారు. కానీ బీజేపీ నాయకులు అనేకమంది ఆయన భక్తులు, అనుయాయులే. బాబాలను, మూఢ నమ్మకాలను విశ్వసించడంలో రాజకీయ నాయకులు పార్టీలతో నిమిత్తం లేకుండా పోటీ పడ్తారు. పరిపాలనా వ్యవస్థకు పూచీ పడవలసిన అధికారపక్ష నాయకులే మూఢ నమ్మకాలలో మునిగి తేలుతున్నప్పుడు, బాబాలకు భక్తులైనప్పుడు ప్రజలకు భద్రత ఉండే అవకాశం లేదు. ఈ దుర్ఘటన తరవాత దాఖలు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌.లో ఇప్పటి వరకు బాబా పేరే లేదు. కానీ తొలిదశలో మాత్రం ఆయనను కాపాడడానికి సకల ప్రయత్నాలు జరుగుతున్నట్టు స్పష్టం అవుతోంది. ఈ సత్సంఘానికి అనుమతి తీసుకున్న వారి పేర్లు మాత్రమే ఎఫ్‌.ఐ.ఆర్‌.లో నమోదు చేశారు. ఈ దుర్ఘటనకు ప్రత్యక్ష బాధ్యుడు సాక్షాత్తు బాబాయేనన్న విషయాన్ని పట్టించుకోకపోవడంలోనే అసలు కుట్ర దాగి ఉంది. తొక్కిసలాట జరిగిన తరవాత బాబా తన అనుయాయులతో కలిసి అక్కడి నుంచి ఉడాయించారు. తీరా తొక్కిసలాట జరిగిన తరవాత మృతులను, గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ ఉన్నది ఒకే ఒక డాక్టరు. కనీస ఆరోగ్య సదుపాయాలు దగ్గరలో లేనిచోట ఇంత భారీ సత్సంగాలను ఎలా అనుమతిస్తారో భక్తిలో ముణిగిపోయే ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. వ్యక్తిగత విశ్వాసాలు, పరిపాలనా బాధ్యతల మధ్య తేడా లేనప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కాక తప్పదు. ఈ తొక్కిసలాట జరిగిన సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో రాహుల్‌ గాంధీ అంతకు ముందుచేసిన ప్రసంగంలోని లోపాలను వెతికి పట్టి ఖండిరచడంలో నిమగ్నమయ్యారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం అందిన తరవాత కూడా ఆయన ప్రసంగ ధార కొనసాగిస్తూనే ఉన్నారు.
నిజానికి భోలే బాబా ఇంతకు ముందే నేరస్థుడు. జైలుకు కూడా వెళ్లి వచ్చిన ఘనుడాయన. కొంతకాలం పోలీసువిభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసి సస్పెండ్‌ అయిన తరవాత ఉద్యోగం మానేసి బాబా అవతారమెత్తాడు. బాబా రాం రహీం సింగ్‌ మీద ఉన్నట్టే భోలే బాబా మీద కూడా లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలున్నాయి. ఉత్తరప్రదేశ్‌ లోనే కాకుండా ఆయనకు రాజస్థాన్‌, హర్యానా, మధ్య ప్రదేశ్‌ లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా అపారమైన భక్త గణం ఉంది. అలాగే వివిధ రాష్ట్రాలలో ఆయన మీద కేసులూ ఉన్నాయి. ఆయన అసలు పేరు సూరజ్‌ పాల్‌. నారాయణ్‌ సర్కార్‌ హరి అన్న మరో పేరో, మారు పేరో కూడా ఉంది. కానీ భోలే బాబాగానే ప్రసిద్ధుడు. హాత్రస్‌ దగ్గర్లో జరిగిన ఈ సత్సంగానికి హాజరై మృత్యువాత పడ్డవారు, గాయాలపాలైన వారిలో ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు, బాలలే ఉన్నారు. తమ ఈతి బాధల నుంచి బయట పడడానికీ బాబా ప్రవచనాలు విని తరించిపోవడం కోసం సత్సంగానికి వచ్చి ‘‘మోక్షం’’ పొందారు. ఆయన పాద ధూళిలో మహత్తు ఉందని, ఆయన దగ్గర మంత్ర జలం ఉంటుందని, అది తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని జనం నమ్ముతారు. అలా నమ్మడానికి బాబా భోలేనాథ్‌ తన శిష్యగణం ద్వారా వాడవాడలా ప్రచారం చేయిస్తారు. ఆయన సంపత్తికి లోటు లేదు. లెక్కలేనన్ని ఖరీదైన కార్లు. వివిధ ప్రాంతాలలో దాదాపు 25 ఆశ్రమాలు. దుర్ఘటన జరిగిన తరవాత కకావికలైన భక్తులను ఆదుకోవడానికి బదులు అక్కడి నుంచి శిష్యగణంతోపాటు బాబా పలా యనం చిత్తగించారు. భక్తులను కాపాడడానికి ఏ ప్రయత్నమూ చేయని ‘‘దైవాంశ సంభూ తుడు’’ ఆయన. ఆయన ఇతర బాబాల్లాగా కాషాయ వస్త్రాలు ధరించరు. ఎప్పుడూ శ్వేత వస్త్రాల్లోనే కనిపిస్తారు. ఖరీదైన కళ్లజోడు వాడతారు. ఈ లెక్కన ఆయన అత్యాధునిక బాబా. ఆయన ఆశ్రమాల్లో ఎక్కడా ఆ గ్రామాల వారికి ప్రవేశార్హత ఉండదు. ఎప్పుడూ భార్య పక్కనే ఉంటుందట. కానీ 16-17 ఏళ్ల అమ్మాయిలతో కులుకుతుంటారు. ఆయన అన్ని ఆశ్రమాలు అక్రమ నిర్మాణాలేనంటున్నారు. భగవంతుడు ప్రత్యక్షమైన తరవాత పోలీసు ఉద్యోగం వదిలేశానంటున్నాడు. బాబా పాద ధూళి తాకితే సకల పాపాలు హరించుకుపోతాయని ఆయన శిష్యగణం ప్రచారంచేసి భక్తులను సమీకరిస్తుంది. బాబా కారు నుంచి దిగగానే అతని పాదాలను తాకడంకోసం అమాయకజనం పోటీ పడడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. బాబా పాదధూళి దక్కని వారు ఆయన కారును తాకినా తరించి పోయామనుకుంటారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఇలాంటి దుర్ఘటనలన్నీ నివారించగలిగినవే. కానీ ప్రభుత్వ పెద్దలే పాద ధూళికోసం పరితపిస్తున్నప్పుడు జనానికి రక్షణ ఉంటుందనుకోలేం. సమిధలయ్యేది సామాన్య జనమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img