London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

‘ఇండియా’ విజయానికి ఐక్యతే ప్రధానం

ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘‘ఇండియా’’లో సానుకూల, ప్రతికూల అంశాలు ఏకకాలంలో వ్యక్తం అవుతున్నాయి. ఇండియా ఐక్య సంఘటనపై నితీశ్‌ కుమార్‌కు అసంతృప్తి ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఆయన హఠాత్తుగా ఫిరాయించే అవకాశం ఉందని అంటున్నారు. మరో వేపు పెద్ద భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌కు ఇండియా ఐక్య సంఘటనలోని వివిధ భాగ్యస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీకి సంప్రదింపులు మొదలయ్యాయి. ఒక్కో రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపిణీకి సిద్ధం కాకపోతే లక్ష్య సాధన సాధ్యం కాదన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితికు అనుగుణంగా సీట్ల సర్దుబాటు జరగాలని కాంగ్రెస్‌ అనుకుంటోంది. చిన్న పార్టీలతో తోడ్పాటుకు అనుకూలంగా ఉండే లక్షణం సాధారణంగా కాంగ్రెస్‌కు ఉండదు. కానీ ప్రస్తుత పరిస్థితిలో మిగతా పార్టీలను కూడగట్టుకుని వెళ్లకపోతే ఫలితం ఉండదన్న వాస్తవాన్ని కాంగ్రెస్‌ గ్రహించినట్టుంది. కేరళలో ప్రస్తుతం వామపక్ష ప్రజాతంత్ర ఫ్రంట్‌ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఈ రెండు పక్షాలూ ఐక్య సంఘటనలోని భాగస్వామ్య పక్షాలే కనక బలాబలాల ఆధారంగా సర్దుబాట్లు చేసుకోక తప్పదు. అయితే ఈ రెండు పక్షాల మధ్య నేరుగా సీట్ల పంపిణీ కుదరకపోవచ్చు. అయినా ఐక్యతకు భంగం కలగకుండా తమ బలాన్ని నిరూపించుకుంటూనే పోటీ చేసే అవకాశం ఉంది. కేరళలో 20 లోకసభ స్థానాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ ప్రత్యర్థి కాదు. అందువల్ల ఏ పక్షం గెలిచినా ఆ సీట్లు ఇండియా ఐక్య సంఘటన ఖాతాలోనే పడ్తాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ బలంగా ఉంది. ప్రస్తుతానికి అక్కడ ప్రధాన ప్రతిపక్ష కూటములైన కాంగ్రెస్‌, వామపక్ష ఫ్రంటు అంత బలంగా లేవు. పైగా ప్రతిపక్షాల ఐక్యత కోసం తమ చేతిలో ఉన్న సీట్లను కాంగ్రెస్‌కో, వామపక్ష ఫ్రంటుకో కేటాయించడానికి తృణమూల్‌ అంగీకరించకపోవచ్చు. అందుకని అన్ని పక్షాలు తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయాల్సిందే. మహా అయితే మమతా బెనర్జీ నాయకత్వంలోని పార్టీ స్వల్పస్థాయిలో కాంగ్రెస్‌తో సర్దుబాట్లకు సిద్ధపడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వామపక్షాలు విడిగా పోటీ చేయవలసి వస్తుంది. అయితే మమతా బెనర్జీ వైఖరి మారకపోతే బీజేపీకి ప్రయోజనం కలిగినా ఆశ్చర్య పడవలసిన పనిలేదు. ముక్కోణపు పోటీవల్ల బీజేపీకి లాభం కలగవచ్చు. తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్‌, జార్ఖండ్‌లో ఇండియా ఐక్యసంఘటన కలిసే పని చేస్తున్నది. ఈ రాష్ట్రాలలో ఒక్క మహారాష్ట్రలో మినహాయిస్తే మరెక్కడా కాంగ్రెస్‌కు అస్తిత్వమే మిగలలేదు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వంతో సీపీఐ, సీపీఎం కలిసి పనిచేస్తున్నాయి. ఇదే ఏర్పాటు 2024 ఎన్నికలలోనూ కొనసాగవచ్చు. తమిళనాడులో సీపీఐకి రెండు, సీపీఎంకు రెండు లోకసభ స్థానాలు ఉన్నాయి. బీహార్‌లో సీపీఐ (ఎం.ఎల్‌.) కూడా అస్తిత్వంలో ఉంది. సీపీఐ ప్రస్తుతానికి సీపీఐ (ఎం.ఎల్‌.) తో సీట్ల సర్దుబాటు చర్చలు కొనసాగిస్తోంది. జేడీ(యూ), రాష్ట్రీయ జనతా దళ్‌ కూడా సీపీఐకి కొన్ని స్థానాలు కేటాయించడానికి సిద్ధపడే అవకాశమే ఎక్కువ ఉంది. జనతా దళ్‌(యు) నాయకుడు కె.సి. త్యాగి ఇటీవలే కాంగ్రెస్‌ మీద విరుచుకు పడ్డారు. ఆయన అనుభవజ్ఞుడైన నాయకుడు. ఆచి తూచి మాట్లాడే స్వభావం ఉన్నవారు కనక ఆయన మాటలను తేలికగా కొట్టి పారేయడానికి వీలు లేదు. ఇండియా ఐక్య సంఘటనకు ఎవరు కన్వీనర్‌గా ఉండాలన్న విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖడ్గే వైఖరి త్యాగి విమర్శకు కారణమైంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ప్రయోజనం ఉంటుంది. అసోం, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్‌, కర్నాటక, తెలంగాణ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌్‌లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఇతర భాగస్వామ్య పక్షాలు నిరాకరించడానికి వీలులేనంత బలం ఉంది. 14 లోకసభ స్థానాలున్న అసోంలో బీజేపీని ఎదుర్కోగలిగిన ప్రధాన పార్టీ కాంగ్రెసే. కానీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెరో సీటైనా కేటాయిస్తే ఇండియా కూటమికి మేలు కలుగుతుంది. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ నాయకత్వంలోని ఎన్డీయే. అసోంలో బలంగా ఉంది. అందువల్ల వామపక్షాలను చిన్నబుచ్చకుండా ఉంటేనే ఇండియా ఐక్య సంఘటనకు మేలు కలుగుతుంది. 12 సీట్లున్న ఒడిశాలో బిజూ జనతా దళ్‌ అధికారంలో ఉంది. ఇండియా కూటమి అక్కడ ఒకవేపు బీజేపీని, మరోవేపు బిజూ జనతాదళ్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక్కడ కమ్యూనిస్టులకు ఉన్న పట్టు స్వల్పమే అయినా సర్దుబాట్లు కాంగ్రెస్‌కు మేలే చేస్తాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టులకు గణనీయమైన బలం ఉండేది. ప్రస్తుత లోకసభలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీకి 22 స్థానాలున్నాయి. టీడీపీ సభ్యులు ముగ్గురు గెలిచారు. ఇప్పుడు ఆ పార్టీ కుదేలై పోయింది. పుంజుకునే అవకాశాలూ కనిపించడం లేదు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల మధ్య సర్దుబాటు కుదిరితే జగన్‌ పార్టీని నిలవరించే వీలుంటుంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెరి ఒకటో, రెండో సీట్లు కేటాయించగలిగితే కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది.
ఇండియా ఐక్య సంఘటనలోని పక్షాల మధ్య సవ్యమైన సీట్ల సర్దుబాటు జరిగితే లక్ష్య సాధన సులభం అవుతుంది. అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పెద్ద రాజకీయ పక్షమే కావచ్చు. కానీ కమ్యూనిస్టుల మద్దతు కూడగట్టగలిగితేనే మంచి ఫలితాలు సాధించవచ్చు. ప్రాంతీయంగా బలాబలాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పటిష్ఠమైన సిద్ధాంత ప్రాతిపదిక సమకూరితేనే ఇండియా కూటమికి ఉపకరిస్తుంది. ఇండియా కూటమి ఏర్పడక ముందు ఎప్పుడు ప్రతిపక్షాల ఐక్యత చర్చకు వచ్చినా వామపక్షాలను పరిగణనలోకి తీసుకునే వారు. ఇప్పుడు కమ్యూనిస్టులకు పార్లమెంటులో బలం తగ్గింది కనక వాటిని విస్మరిస్తున్న అపసవ్య ధోరణి కనిపిస్తోంది. వామపక్షాల పాత్ర ఉంటే తప్ప మతతత్వ, నిరంకుశ శక్తులను ఎదిరించే అవకాశం ఉండదు. బీహార్‌లో ఒక్క స్థానం అయినా దక్కించుకోవాలని సీపీఐ భావిస్తోంది. సర్దుబాటు కుదిరితే అది అసాధ్యం ఏమీ కాదు. అసోంలో ఒకప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెప్పుకోదగిన స్థానం ఉండేది. రాజస్థాన్‌లో సమాజ్‌ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్‌కే ఉపకరిస్తుంది. ఇండియా ఐక్య సంఘటనలో బీజేపీని గద్దె దించాలన్న కోరిక ఎంత బలంగా ఉన్నప్పటికీ గట్టి సిద్ధాంత ప్రాతిపదిక సమకూరకపోతే బీజేపీని ఓడిరచడం సాధ్యం కాదు. వామపక్షాలు లేకుండా ఆ సిద్ధాంత ప్రాతిపదిక ఏర్పడే అవకాశం లేదు. వివిధ కారణాలవల్ల కాంగ్రెస్‌కు పరిస్థితి సానుకూలంగా మారినా ఇండియా ఐక్య సంఘటనలోని ఇతర పక్షాలను విస్మరిస్తే కాంగ్రెస్‌ సాధించేది పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. ఇండియా కూటమికి దక్షిణాదిలో ఉన్న గట్టి నాయకత్వం ఉత్తరాదిలో కనిపించడం లేదు. ఉత్తరాదిలో ఇండియా ఐక్య సంఘటనకు ప్రాతినిధ్యం వహించే నాయకుడూ లేడు. ఈ అవకాశం ఎంత కాదన్నా నితీశ్‌ కుమార్‌కే ఉంది. నితీశ్‌ కుమార్‌ కనీసం రెండు సార్లు బీజేపీతో పొత్తు కూడి ఉండవచ్చు. ఆయన ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా బీజేపీతో మైత్రి ఆయనకు ఉపకరించే పరిస్థితి లేదు. ఇండియా ఐక్య సంఘటన ప్రతిపాదన ప్రధానంగా నితీశ్‌ కుమార్‌ నుంచి వచ్చిందే. ఆ విషయమూ ఆయనకు తెలుసు. ఇండియా ఐక్య సంఘటనలో అంతర్గత విభేదాలు ఉన్నా లక్ష్య సాధన మీద కచ్చితమైన దృక్పథమే ఉంది. కనక నితీశ్‌ ఇండియా కూటమితో కొనసాగక తప్పదు. మోదీని ఓడిరచడానికి జనం సిద్ధంగా ఉన్నారన్న విషయం ఐక్య సంఘటన నాయకులు గ్రహించకుండా ఉంటారనుకోలేం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img