Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఉమ్మడి పౌరస్మృతి చాటున విధ్వంసం

ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీని గెలిపించడానికి ప్రధానమంత్రి మోదీకి ప్రజలను నిట్ట నిలువునా చీల్చడానికి మత సంబంధమైన వ్యవహారం ఏదో ఒకటి ఉండాలి. మరో మూడు నాలుగు నెలల్లో మధ్యప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఏదో ఒక సమస్యను రెచ్చగొట్టి ముస్లింల మీద ద్వేషం పెంచి ఓట్లు సంపాదించాలనుకుంటున్న మోదీ అన్ని మతాలకు వర్తించే ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని లేవనెత్తి కొత్త వివాదానికి తెర తీశారు. వాజపేయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వివాదాస్పదమైన రామజన్మ భూమి, కశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణం రద్దు ఉమ్మడి పౌర స్మృతి అన్న వివాదాస్పద అంశాలను పక్కన పెట్టారు. అప్పుడు బీజేపీ ఈ విధానాన్ని అనుసరించడానికి ప్రధాన కారణం బీజేపీకి లోకసభలో సంపూర్ణమైన మెజారిటీ లేకపోవడమే. మోదీ నాయకత్వంలో బీజేపీ ఒంటరిగానే 303 స్థానాలు సాధించి సంపూర్ణమైన మెజారిటీ సంపాదించింది. రామ మందిర నిర్మాణం విషయంలో అత్యున్నత న్యాయస్థానం బీజేపీకి అనుకూలమైన తీర్పు ఇచ్చింది. 370వ అధికరణాన్ని బీజేపీ ఏకపక్షంగా రద్దు చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగవలసి ఉంది. బీజేపీ ఎజెండాలో అమలులోకి రాకుండా ఉండిపోయిన ఉమ్మడి పౌర స్మృతిని కూడా ఎలాగోలా అమలు చేసేయాలన్నది మోదీ పన్నాగం. అదేమంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో భాగమైన 44వ అధికరణం ప్రకారం ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి తేవడానికి కృషి చేయాలని ఉంది కనక తాము ఉమ్మడి పౌరస్మృతిపై మాట్లాడడం రాజ్యాంగబద్ధమే నన్నది మోదీ, ఆయన మద్దతుదార్ల వాదన. ‘‘ఒకే కుటుంబంలో భిన్నమైన నిబంధనలు ఉంటే ఆ కుటుంబం ఎలా సమైక్యంగా ఉంటుంది? అలాంటిది భిన్న మతాలవారికి వేర్వేరు పౌరస్మృతులు ఉంటే ఎలా పొసగుతుంది’’ అన్నది మోదీ, బీజేపీ వాదన. ముఖ్యంగా ఇది ముమ్మారు తలాక్‌ లాగా ఎక్కుపెట్టిన బాణమే. పౌరులందరికీ ఒకే రకమైన హక్కులు ఉండాలిగా అని మోదీ సర్కారు ప్రశ్నిస్తోంది. ఆదేశిక సూత్రాలలో కొన్నింటిని దశలవారీగా ఇప్పటికే అమలు చేసేశాం. మరికొన్ని చేయవలసి ఉంది. రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయడానికి సమయం ఆసన్నం కాలేదని బీజేపీ లాంటి ఒకటి రెండు పార్టీలు మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ భావిస్తూ వచ్చాయి. అందుకే దాని జోలికెళ్లలేదు. ఉమ్మడి పౌరస్మృతి అంటే పెళ్లి, దత్తత, వారసత్వ హక్కుల్లో ఏకరూపత. దేశవాసులందరికీ ఒకే రాజ్యాంగం వర్తిస్తుంది కనక ఏ మతం వారికైనా ఒకే వివాహ చట్టం ఉండేట్టు చూడడానికి ఉన్న ఉపకరణమే ఉమ్మడి వివాహ చట్టం. ఇందులో వివాదాలకు తావు లేదు. కానీ ఏ చట్టమైనా వైవిధ్యభరితమైన భారత సంస్కృతిని దెబ్బ తీసేలా ఉండకూడదన్న భావనతోనే ఉమ్మడి పౌరస్మృతి వివాదాలకు దారి తీస్తుందనుకుని ఈ ఏడు దశాబ్దాలుగా అలాంటి చట్టం తీసుకు రాలేదు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు మనం అనుసరించవలసిన ఆదేశాలను నిర్దేశిస్తాయే తప్ప అందులో పేర్కొన్న ప్రతి అంశాన్ని చట్ట రూపంలోకి తీసుకు రావాలని చెప్పవు. ఒక వేళ అలా చెప్పవలసిన అవసరమే ఉంటే రాజ్యాంగం రూపొందించే సమయంలోనే ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగంలో భాగమై ఉండేది. ఆదర్శాలను అమలు చేయడానికి అనువైన వాతావరణం ఉండాలి. మత ప్రాతిపదికనగానీ మరో రకంగా కానీ ఏ వర్గం మీదా కసి తీర్చుకునే ఉద్దేశం ఉండకూడదు. మన దేశం అనేక మతాల, భాషల, సంస్కృతుల, ఆచారాల సమాహారం. ఇవి తరతరాలుగా ఆయా వర్గాలు అనుసరిస్తూ వస్తున్నవే. 

ఉమ్మడి పౌరస్మృతివల్ల కొన్ని ప్రయోజనాలు లేకపోలేదు. ఉమ్మడి పౌరస్మృతి అంటే మత సంబంధమైన వైవిధ్యత, ఆచారాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వివాహ చట్టం అమలు చేయడం. ముస్లింల మీద విద్వేష భావనవల్ల ఉమ్మడి పౌరస్మృతి కోసం వెంపర్లాడుతున్నారే తప్ప దానివల్ల కలిగే మేలు ప్రజలకు అందేలా చేయడానికి కాదు. ఈ స్మృతివల్ల స్త్రీపురుషుల మధ్య వివక్ష లేకుండా చూడవచ్చునని, జాతీయ సమైక్యత పెంపొందించవచ్చునని, అసలైన సెక్యులర్‌ విధానాలను అనుసరించవచ్చునని అంటున్నారు. జాతీయ సమైక్యతకు భంగం కలగడానికి కారణం ఉమ్మడి పౌరస్మృతి లేకపోవడం కాదు. సెక్యులర్‌ విధానాలకు ఉమ్మడి పౌరస్మృతి లేకపోవడం అడ్డంకి అవుతున్న దాఖలాలు లేవు. పురుషాధిక్యతను తగ్గించవచ్చుననీ అంటున్నారు. మహిళలకు చదువుకునే హక్కు కల్పించడం, ఆస్తిలో సమాన వాటా ఇవ్వడం లాంటి ప్రయత్నాలు ఇప్పటికే జరిగాయి. కొంత మేర సత్ఫలితాలూ ఇచ్చాయి. లోటు ఏమైనా ఉంటే దానికి కారణం ఉమ్మడి పౌరస్మృతి లేకపోవడమేననడం వితండ వాదమే అవుతుంది. రాజ్యాంగం మత స్వేచ్ఛకు పూచి పడుతోంది అంటే అన్ని మతాల వారు ఒకే రకమైన ఆచారాలు పాటించాలని బలవంత పెట్టడం కానే కాదు. ప్రతి మతం వారూ తమకు విశ్వాసం ఉన్న మతాన్ని అనుసరించవచ్చు, ప్రచారం చేయవచ్చు. అయితే బలవంత పెట్టకూడదు. ఉమ్మడి పౌరస్మృతి పేర ఒకే వివాహ, వారసత్వ, దత్తత సూత్రాలను వర్తింప చేయడంవల్ల రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను ఉల్లంఘించినట్టే అవుతుంది. ఉమ్మడి పౌరస్మృతివల్ల ప్రయోజనాలు ఏకరువు పెట్టే వారి ప్రధాన వాదన ఏమిటంటే ముస్లింలు నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనక వారి జనాభా అమాంతం పెరిగిపోతోందని భయాందోళనలు రెచ్చగొడ్తున్నారు. నిజానికి ముస్లింలు నాలుగు పెళ్లిళ్లదాకా చేసుకోవచ్చు అనడం దానికి ఉన్న పరిమితులను, ఆకాంక్షలను తరచి చూడకపోవడమే. ఇస్లాం మతం మహిళలకు పరిమితంగానైనా సరే ఆస్తి హక్కు కల్పిస్తోంది. స్త్రీ ధనాన్ని పురుషులు ముట్టుకోకూడదు. అలాగే నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోవడం హక్కు కాదు. బహుభార్యత్వం ముస్లింలకే పరిమితమైన అంశం కాదు. బహు భార్యత్వం హిందువులలోనూ ఉంది. నాలుగేసి పెళ్లిళ్లు చేసుకున్న ముస్లింలు ఎంత శాతం అని లెక్కలు తీసి చెప్పడం ఉమ్మడి పౌరస్మృతి తరఫున వకాల్తా పుచ్చుకున్నవారు ఇప్పటిదాకా చేయలేక పోయారు. ముస్లిం మహిళలకున్న ఆస్తి హక్కు హిందూ మహిళలకు ఎందుకు లేదో చెప్పరు. అల్పసంఖ్యాక మతస్థులైన ముస్లింలని దృష్టిలో ఉంచుకుని పక్షపాత దృష్టితో ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలనుకోవడం నిజానికి మత సామరస్యాన్ని కూకటి వేళ్లతో సహా నిర్మూలిస్తుంది. భిన్న మతాల ఆచారాలను, సంప్రదాయాలను కొరగాకుండా చేస్తుంది. ఉమ్మడి పౌరస్మృతి వైవిధ్యభరితమైన సమాజం మీద రుద్దడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే. విద్య, ఆహారపు అలవాట్లు మొదలైన వాటి గురించే ఇతర మతాల వారి అలవాట్లను, ఆచారాలను, సంప్రదాయాలను గౌరవించకుండా విద్వేషం నింపే వాతావరణంలో ఉమ్మడి పౌర స్మృతి గొడ్డలి పెట్టులా తయారవుతుంది. మతాల మధ్యే కాదు వివిధ రాష్ట్రాల, ప్రాంతాల, సామాజిక వర్గాల మధ్య భిన్నత్వం ఉన్న దేశం మనది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img