Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

నల్లచట్టాలపై కదలిక ఏదీ?

కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయతలపెట్టిన నేరచట్టాల పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ మధ్యనే లారీలు, ట్రక్కుల డ్రైవర్లు, భారీ వాహన యజమానులు మూడు రోజులపాటు ఆందోళన చేపట్టారు. విచిత్రమేమిటంటే, ఈ నిరసనలకు  ప్రతిపక్షాలు నాయకత్వం వహించ లేదు. ఈ చట్టాలతో హతాశులైన వర్గాలు మాత్రమే ఈ ఆందోళనకు పూనుకున్నాయి. అసలు ఈ చట్టాలేమిటో, దాని సారాంశమేమిటో ఇప్పటికీ న్యాయమూర్తులు, న్యాయవాదులకు సైతం పూర్తిగా తెలియదు. ఒక్కొక్క సెక్షన్‌ గురించి అవగాహన చేసుకుంటూ ఉంటే వాటి తీవ్రత అర్ధమవుతోంది. ముఖ్యంగా ఐపీసీ స్థానంలో వచ్చిన భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) పూర్తిగా అమలైతే సమీప భవిష్యత్‌ తరాలు ‘పౌరహక్కులు అనేవి ఒకప్పుడు భారత్‌లో ఉండేవి’ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కొత్త నేర చట్టాల ఆమోదమే ఓ ప్రహసనం. దాదాపు ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్‌ చేసి పార్లమెంటులో ఆమోదింపజేసుకున్న నల్లచట్టాల్లో ఇవి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఈ మూడు చట్టాల్లోని లొసుగులను ఆనాడే ‘గోదీ’యేతర మీడియా ఘోషించింది. నిలువునా ఫాసిస్టు విషబీజాలతో వికటాట్టహాసం చేసే మోదీ సర్కారు అవేవీ పట్టిం చుకోలేదు. శతాబ్ధకాలంనాటి చట్టాలను మార్చాలంటే సుదీర్ఘచర్చ జరపాలన్న ఇంగితజ్ఞానం బీజేపీకి లేకకాదు. నియంతృత్వ భావజాలమే దాని స్వరూపస్వభావాలు కాబట్టి అది జరగలేదు. ఈ చట్టాలతో సంఫ్‌ుపరివార్‌ విశ్వరూపం బయల్పడిరది. ప్రస్తుతానికి ట్రక్కర్ల సమ్మెను నిలుపుదల చేయించేందుకు తాత్కాలికంగా ఈ చట్టాల అమలును ఆపినా, వాటిని గణతంత్ర దినోత్సవం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటం ఆందోళనకరం. అతివేగం, నిర్లక్ష్యపూరిత చర్యల కారణంగా వాహనం నడిపి రోడ్డుపై వ్యక్తుల మరణానికి కారణమైతే, ఆ నేరానికి పాల్పడిన డ్రైవరుకు పదేళ్ల జైలు శిక్ష, లక్షలాది రూపాయలు జరిమానా విధిస్తూ బీఎన్‌ఎస్‌లోని 106వ సెక్షన్‌ పేర్కొంటున్నది. పాత చట్టం ఐపీసీలోని 304ఏ సెక్షన్‌ స్థానంలో ఇది వచ్చింది. కేవలం ఫాసిస్టు దేశాలు, ఒక తరహా ముస్లిం చట్టాలు అమల్లో ఉన్న దేశాల్లో మాత్రమే ఇలాంటి చట్టాలు, శిక్షలు ఉంటాయి. అందుకే ఆరంభంలోనే డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ట్రక్కర్ల సమ్మె అనూహ్యం. ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతంలో వేలాది లారీలు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలు నిలిచిపోయాయి. పెట్రోల్‌ బంకులు వెలవెలబోయాయి. సరుకు రావాణా నిలిచిపోయింది. మార్కెట్‌ పడిపోయింది. ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌తో ప్రభుత్వం జరిపిన చర్చల్లో నిజాయితీ మృగ్యం. అందుకే ట్రక్కర్లు సమ్మెను పునరుద్ధరించే అవకాశాలను త్రోసిపుచ్చలేం. ఈ మధ్యనే ఇజ్రాయిల్‌లో అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహూ ప్రాథమిక చట్టాలను సవరించడానికి ప్రయత్నించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆయనను తీవ్రంగా మందలించింది. న్యాయవ్యవస్థపై కాకుండా పశ్చిమాసియా యుద్ధ విరమణపై దృష్టి పెట్టాలని మొట్టికాయలు వేసింది. మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు. గత కొన్ని సంవత్సరాలుగా వెలువడుతున్న తీర్పులే ప్రజలను సందిగ్థంలో పడేస్తున్నాయి. కోర్టు ధిక్కార భయాలు ఎక్కువయినందున ఏమీ అనడానికి లేదు, మాట్లాడటానికి లేదు. దురదృష్టకరం, విచారకరమని వ్యాఖ్యానించడం తప్ప. తాజాగా నేరచట్టాలపై సుప్రీంలో కేసులు దాఖలయ్యాయి. ఈ మధ్యనే అదానీకి జైకొట్టినట్లు, ‘ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేం’ అని తీర్పులొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. మోదీ నేరచట్టాలను ఉపసంహరించుకోవాలంటే ఒక్కటే మార్గం. ప్రజా ఉద్యమం. పార్టీలన్నీ ఎన్నికలు, సీట్ల గోలలో ఉన్నందున మహోద్యమాలను ఆశించలేం. కొత్త చట్టాల కారణంగా కోర్టుల్లో మారిన సెక్షన్‌ నంబర్లకు అలవాటు పడటానికే న్యాయవాదులకూ, న్యాయమూర్తులకూ కొన్నేళ్లు పట్టవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలను మార్చాల్సిందే. కాకపోతే ఉద్దేశం అంతకుమించిన అరాచక చట్టాలను అమలు చేయాలని కాదు. పార్లమెంటరీ విధివిధానాలను, పూర్వోదా హరణలను ఉల్లంఘించి, ఎలాంటి సంప్రదింపులు, చర్చలు లేకుండా, ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్‌ చేసి చట్టాలను తెచ్చిన తర్వాత, వీధిపోరాటలొక్కటే మిగిలాయి. అదే ప్రజాశక్తి. మోదీ సర్కారు మెడలు వంచాలంటే అదొక్కటే మార్గం. అఖిలపక్ష ప్రమేయం లేకుండా, చట్టాలను అనుభవించే వర్గాలను సంప్రదించకుండా బిల్లులను తయారు చేయడం గత తొమ్మిదేళ్లుగా ఈ దేశంలో పరిపాటిగా మారింది. బీఎన్‌ఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌, బీఎస్‌ బిల్లుల తయారీలో సెలక్ట్‌ కమిటీల పాత్ర కూడా లేదు. స్థాయీసంఘాల పరిశీలన లేదు. శాసన పరిశీలన లేనేలేదు. ప్రతిపక్ష ఎంపీలకు ఎలాగూ తెలీదు. పాలక పార్టీ ఎంపీలకు కూడా ఈ బిల్లు గురించి తెలీదు. మోదీషా నేతృత్వంలోని సంఫ్‌ు శక్తులతో కూడిన ఒక ఫాసిస్టు కమిటీకి మాత్రమే ఈ బిల్లులూ, దానిలోని సారమూ తెలుసు. కరోనాకు ముందు ఏకంగా 16 కీలకమైన బిల్లులు సెలక్ట్‌ కమిటీకి వెళ్లకుండానే లోక్‌సభ బల్లపైకి చేరాయి. సీఏఏ`ఎన్‌ఆర్‌సీ`ఎన్‌పీఆర్‌ విషయంలోనూ ఇదే జరిగింది. పౌరసత్వ బిల్లుపై నిరసనలు మిన్నంటాయి. అంతకుముందు రైతులు నల్లచట్టాలపై ఉవ్వెత్తున ఉద్యమించారు. లేబర్‌ కోడ్‌పై కార్మికులు తమ ఆందోళనలతో దేశాన్ని అట్టుడికించారు. కులమతాలు, వర్గాలకతీతంగా సాగిన ఈ ఉద్యమాలు దేశ చరిత్రలోనే మేలిమలుపు. ఇవన్నీ ప్రజాందోళనలే. నేరచట్టాలపై పెద్దగా స్పందించడం చేతకాని ప్రతిపక్షాలు సైతం గుణపాఠాలు నేర్చుకోదగ్గ ఉద్యమాలివి. మోదీ విధానాలపై పౌరహక్కుల నేతలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, పాత్రికేయులు గళంవిప్పి అరెస్టయిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు డ్రైవర్ల ఆందోళన కూడా ఆ కోవలోనిదే. వారిని చూసైనా కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలు, కుర్చీ కదలకుండా కాపాడుకునే యత్నంలో కేంద్ర తప్పిదాలను విస్మరించిన ప్రాంతీయ పార్టీలు మేల్కొని మోదీ సర్కారుపై తిరగబడేలా కార్యాచరణ రూపొందించుకోవాలి. రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యయుత సూత్రాల ప్రాతిపదికగా ఏర్పడిన స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగ విలువలను త్రోసిరాజని సమర్ధవంతమైన పాలన, హుందాతో కూడిన పాలనా ప్రక్రియను గాలికొదిలేసి, చట్టాలు చేస్తున్న తీరు అత్యయిక పరిస్థితికి అద్దంపడుతోంది. 

నిద్రపోతూ డ్రైవింగ్‌ చేయకూడదు. అలా చేస్తే ప్రమాదాలు సంభవిస్తాయి. దానికి శిక్షలుంటాయి. కానీ నిద్రపోతూ చట్టాలు చేయొచ్చా? ఫాసిజం మత్తులో బిల్లులు రూపొందించి జనాల మీద రుద్దేయవచ్చా? ముస్సోలినీ చట్టాలకూ, మోదీ చట్టాలకూ తేడా ఏముంది? దేశంలో నియంతృత్వ, సామ్రాజ్యవాద రాజ్య స్థాపనకు ప్రతినబూనిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే కనీసం 30 వరకూ నల్లచట్టాలను ఆమోదించింది. ప్రజా ఉద్యమానికి ప్రజాస్వామ్యవాదులు పూనుకోకపోతే భవిష్యత్‌ భారతం ప్రమాదంలో పడిపోతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img