Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వడివడిగా ఇండియా అడుగులు

ఇండియా కూటమి వడివడిగా అడుగులు వేస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఇండియా కూటమి ఏర్పడిన నాటినుంచి దాన్ని చెల్లాచెదురు చేయాలని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా అన్ని రకాల కుట్రలు, కుహకాలు పన్నుతున్నారు. మోదీ ప్రభుత్వం వల్ల ఎదురవుతున్న ఆటంకాలను అధిగమిస్తూ ఇండియా కూటమి కాస్త నెమ్మదిగా, ఆలస్యంగానైనా వడివడిగా ముందడుగు వేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ మూలంగా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు కుదరదని బీజేపీ సంతోషపడిరది. రైతు నాయకుడు కీ.శే.చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించి ఆర్‌ఎల్‌డీ పార్టీని మోదీ తమవైపు లాక్కున్నారు. అయితే భారత్‌జోడో న్యాయయాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ చొరవ తీసుకొని అఖిలేశ్‌తో 17 సీట్లకు అంగీకరించి సర్దుబాటు కుదుర్చుకున్నారు. అనంతరం అఖిలేశ్‌ రాహుల్‌ యాత్రలో పాల్గొన్నారు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్‌, బీహార్‌, తమిళనాడు, కర్నాటక, దిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర తదితర మెజారిటీ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు కుదుర్చుకొని దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారసభల నిర్వహణకు పూనుకుంది. ముందుగా బీహార్‌ రాజధాని పట్నాలో మార్చి 3వతేదీన భారీ బహిరంగసభ నిర్వహించడానికి సిద్దపడ్డారు. ఈ సభకు ముందు ఆర్‌జేడీ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌ రాష్ట్రంలో యాత్ర నిర్వహించి ప్రజలను కలుసుకొని ప్రచారం సాగించారు. మరోసారి పార్టీమారి బీజేపీలో చేరేముందు మహా ఘట్‌బంధన్‌ పార్టీల నుంచి సమస్య ఎదురైందని ఏనాడు చెప్పలేదన్న వాస్తవాన్ని వెల్లడిరచి నితీశ్‌కుమార్‌ అసలురంగు బట్టబయలు చేశారు. తనపర్యటనలో ప్రజాదరణ బాగా ఉందని, నితీష్‌ వెళ్లిపోవడమే తమ కూటమికి మేలుచేస్తుందని అన్నారు. నితీశ్‌ పార్టీ మారుతున్నట్టు ప్రకటించిన నాటికి రెండు నెలల ముందే ప్రధాని మోదీ, అమిత్‌షా కుట్రపన్ని ఈ వ్యవహారాన్ని నడిపించినట్టు తెలుస్తోంది. బీజేపీ అధికారానికివచ్చిన నాటి నుంచి ఆయారాం గయారాం కుట్ర విపరీతమై పోయింది. ఇండియా కూటమి ఏర్పడిన నాటి నుంచి దాన్ని చెల్లా చెదురుచేసేందుకు మోదీ, షా చేయని ప్రయత్నంలేదు. నితీశ్‌ కూటమి నుంచి బైటకు వెళ్లిపోయిన వెంటనే ఇండియా పని అయిపోయిందని బీజేపీ నాయకులు దేశవ్యాప్తంగా ప్రచారం సాగించారు. మోదీ ఆకట్టుకున్న గోదీ మీడియా, దేశమంతటా కోట్లు ఖర్చుచేసి ఏర్పాటు చేసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార యంత్రాంగం, సోషల్‌మీడియా ఇండియా కూటమి పని అయిపోయిందని డప్పుకొట్టుకున్నాయి. అయినప్పటికీ మణిపూర్‌ నుంచి రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర జరుపుతూ, మోదీ పదేళ్ల పాలనలో సంపన్నుల అభివృద్ధి కోసమే పనిచేస్తూ సామాన్యులను మరింతగా పేదలుగా మారుస్తున్నారన్న వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నారు. న్యాయయాత్ర సాగిన అన్ని ప్రాంతాల్లో రాహుల్‌కు ప్రజలు గొప్పగా స్వాగతం చెప్తూ ఆదరించారు. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్‌ పశ్చిమప్రాతంలో రైతులు ఆర్‌ఎల్‌డీతో ఉన్నారనుకున్నప్పటికీ రాహుల్‌ను ఎక్కువగా ఆదరించారు. పంటలకు కనీసమద్దతు ధరకు చట్టం చేయాలని రైతులు మరోసారి పోరాటం చేస్తున్నందున బీజేపీని వ్యతిరేకిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ నాయకురాలు మమతాబెనర్జీని కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుకు రాహుల్‌ ఒప్పించగలిగారు. మరోవైపు బెంగాల్‌ సందేశ్‌ ఖలీలో టీఎంసీ నాయకుడు మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడని, భూములు ఆక్రమించుకున్న వ్యవహరాలపై ఆరెస్టు చేయడంద్వారా వచ్చిన నష్టం తగ్గడానికి మమత సకాలంలో చర్య తీసుకున్నారు. అయితే ఇలాంటి అక్రమాలు చేస్తున్న నాయకులకు బీజేపీలో కొదవ ఏమీలేదు. మహిళా కుస్తీ క్రీడాకారులను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని చాలాకాలం ఆందోళన చేసినప్పటికీ మోదీ మౌనం పాటించడమే కాదు, క్రీడాకారులను వేధించారు.
ఏ చిన్న అవకాశం లభించినా కాంగ్రెస్‌ ప్రభుత్వాలను కూల్చేందుకు, వీలైతే తగినంతమంది ఎమ్మెల్యేలకు గాలంవేసి వారిని తమ పార్టీలో చేర్చుకుని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేసుకునేందుకు మోదీ,షా ఎల్ల వేళలా సిద్ధంగా ఉంటారు. ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒకే ఒక కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం హిమాచలప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ ఓటింగ్‌ చేయించుకొని ఒక సీటును బీజేపీ గెలుచుకుంది. అంతేకాదు, అక్కడి ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు బీజేపీ కుట్ర కొనసాగిస్తునే ఉంది. అయితే కాంగ్రెస్‌ సకాలంలో మేల్కొని తగిన చర్యలు చేపట్టి ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని కాపాడుకున్నది. తమకు 370, ఎన్‌డీఏకి 400 సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ప్రతిచోట సభల్లో మాట్లాడుతూ ప్రజలతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. కాంగ్రెస్‌కు 40సీట్లు కూడా రాకపోవచ్చునని ప్రచారం సాగిస్తూ నిరుత్సాహపరిచేందుకు మోదీ ఆయన గోదీ మీడియా శాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ కాంగ్రెస్‌తోపాటు ఆప్‌, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ తదితర పార్టీలు మోదీ ప్రభుత్వం కార్మికులకు, కర్షకులకు చేసిన అన్యాయాలను, ఆకాశం అంటుతున్న అన్ని రకాల వస్తువుల ధరలను నియంత్రించడంలో విఫలమైన విషయాలను ప్రజలకు వివరించడంలో ఏ మాత్రం వెనుకాడడం లేదు. గత సంవత్సరం ప్రతిపక్షాల మధ్య సైద్ధాంతిక, భావజాలమైన, వ్యక్తిగతమైన విభేదాలు తలెత్తినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిరచేందుకు ఇండియాకూటమిగా ఇప్పుడు ఒక్కటయ్యాయి. మొదట కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొరపాటు చేసినప్పటికీ ప్రస్తుతం అన్ని విభేదాలు సర్దుబాటు చేసుకుంది. పొరపాటుతో నష్టపోయిన అంశాన్ని గ్రహించి చకచకా ప్రజలవద్దకు చేరేందుకు పూనుకున్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లతో ఉమ్మడి అభ్యర్థిని బీజేపీపైన పోటీ చేయించేందుకు కూటమి చర్చలు జరపడం మరింత ముందడుగు వేసినట్టవుతుంది. ఒకరిద్దరు వ్యక్తులు కూటమి నుంచి వెళ్లిపోయినప్పటికీ పెద్దగా వచ్చే నష్టం ఉండబోదని విశ్లేషణలు వస్తున్నాయి. పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి చేశానని మోదీ సాగించే అసత్యప్రచారాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి, బలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పటికీ, ఎక్కువగా నష్టపోతున్న హిందువులు సక్రమంగా ఆలోచించి ఓట్లువేస్తారని తాజాగా ఆలోచన చేస్తున్నారు. రానున్న రెండు నెలల్లో అవిశ్రాంతంగా ఇండియాకూటమి పార్టీలు ప్రచారం చేయనున్నాయి. సీట్లసర్దుబాటు దాదాపు పూర్తికావచ్చినందున విస్త్రతప్రాంతాల్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని తరగతుల ప్రజలు కూటమికి సహకరించాలి. ఉన్నతస్థాయిలో ఉన్న కూటమి నాయకులు తమమధ్యగల విభేదాలను సర్దుబాటు చేసుకుని ప్రచారం చేయాలి. అలాగే రాష్ట్రాల యూనిట్ల మధ్య గల సమస్యలను పరిష్కరించుకోవాలి. 20శాతం ఉన్న ముస్లింలు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారన్న సమాచారం కూటమికి ఎంతో ప్రయోజనం. గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య సీట్ల సర్దుబాటు కుదరడం గొప్ప పరిణామం. మరింత కష్టపడితే ఫలితం సానుకూలం కావచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img