Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

చంద్రచూడ్‌కు అగ్నిపరీక్ష

డి.వై. చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తి అయిన తరవాత కనీసం న్యాయవ్యవస్థలో మోదీ ఇష్టారాజ్యం కుదరదని రుజువైంది. సకల వ్యవస్థలను మోదీ తనకు అనుకూలంగా మలుచుకుని కబళించిన తరవాత చివర ఆశ న్యాయ వ్యవస్థమీదే మిగిలింది. కానీ రానున్న కొద్ది రోజుల్లో మూడు ప్రధానమైన కేసులను సుప్రీంకోర్టు విచారించనుంది. వీటి మీద సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులనుబట్టే ప్రధాన న్యాయ మూర్తి ఈ అగ్ని పరీక్షలో నెగ్గుతారో లేదో తేలిపోతుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ అధిపతి సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీ కాలం అక్టోబర్‌ చివరిదాకా అని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ లోగా సుప్రీంకోర్టు సంజయ్‌ కుమార్‌ మిశ్రాను సెప్టెంబరు 15దాకా కొనసాగనివ్వడానికి ఒప్పుకుంది. కానీ గతంలో ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు జులై 31వ తేదీ నాటికి పదవి నుంచి తప్పుకోవాలని ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ ఆదేశించారు. రెండవది దిల్లీ పరిపాలనా పరిధి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దగ్గర ఉంటుందా లేక ముఖ్య మంత్రి దగ్గర ఉండాలా అన్న అంశం కూడా తేలిపోనుంది. అలాగే అదానీ, సెక్యురిటీస్‌ ఎక్స్‌చేంజ్‌ బోర్డు విషయమూ కొలిక్కి వస్తుంది. 2018 నుంచి ఆ పదవిలో ఉన్న సంజయ్‌ కుమార్‌ మిశ్రా మోదీ ప్రత్యర్థులను వేటాడి వేధించడంలో బాగా ఉపయోగపడ్డారు. అందుకే ఆయన పదవీకాలాన్ని ఇప్పటికి మూడుసార్లుపొడిగించారు. ప్రభుత్వం తరఫున ఆయన పెద్దతలారిగా నడుచుకుంటున్నారు. అసలు ఆయన నియా మకమే చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు అభిప్రాయ పడిరది. సుప్రీంకోర్టు ఆయన ఉద్యోగ విరమణ చేయాలని స్పష్టంగా ఆదేశించిన తరవాత కూడా కేంద్ర ప్రభుత్వం ఆయన ఉద్యోగ కాలాన్ని పొడిగించడానికి అనుమతి ఇవ్వాలని అదే సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకుంది. 2021లో కామన్‌కాజ్‌కేసులో తీర్పుచెప్పినప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ స్థానంలోఉన్న వారికి ఉద్యోగవిరమణ వయసువస్తే వారి ఉద్యోగ కాలాన్ని పొడిగించకూడదని ఉత్తర్వుచేసింది. ఒకవేళ ఏ ఉన్నతాధికారి సేవలైనా అవసరం అనుకున్నప్పుడు వారి ఉద్యోగకాలాన్ని పొడిగిస్తే అది స్వల్పకాలానికి మాత్రమే పరిమితం కావాలనికూడా తేల్చి చెప్పింది. 2001లో ఆయన ఉద్యోగ విరమణ సమయం వచ్చినప్పుడే ఆయనకు మరోసారి పొడిగింపు ఇవ్వకూడదని అత్యున్నత న్యాయ స్థానం తెలియజేసింది. ఈ ఆదేశాన్ని జవదాటడానికి కేంద్ర ప్రభుత్వం దిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థ చట్టాన్నే సవరించేసింది. సీబీఐ డైరెక్టర్‌ పదవీ కాలాన్ని ఏడాదిపాటు, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ పదవీకాలాన్ని అయిదేళ్ల దాకా పొడిగించడానికి అవకాశం కల్పించింది. ఈ సవరణను కూడా జయాఠాకూర్‌ మరికొందరు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ప్రభుత్వం చేసిన సవరణలకు 2023లో సుప్రీంకోర్టు ఆమోద ముద్రవేసినా మిశ్రాకు పొడిగింపు ఇవ్వడానికి అంగీకరించలేదు. అయినా ప్రభుత్వం ఈ ఆదేశాన్ని లెక్క చేయకుండా 2021 నవంబర్‌ 17న, 2022 నవంబర్‌ 17న మిశ్రా ఉద్యోగ కాలాన్ని పొడిగించింది. అయితే మిశ్రా ఈ నెల 31వ తేదీ దాకా కొనసాగే అవకాశం ఇచ్చింది. తీవ్రవాదులకు నిధులు అందజేసే విషయంలో నిఘా వేసి ఉంచే ఎఫ్‌.ఎ.టి.ఎఫ్‌. పరిస్థితిని సమీక్షిస్తున్నందువల్ల, కొత్త డైరెక్టర్‌ ఎవరో నిర్ణయించేదాకా మిశ్రా పదవిలో ఉండడానికి అనుమతించింది. ఇంత చెప్పిన తరవాత కూడా కేంద్ర ప్రభుత్వం అదే సుప్రీంకోర్టును 2023 అక్టోబర్‌ పదిహేను దాకా ఆయనను కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని అర్జీ దాఖలుచేసింది. ఎఫ్‌.ఎ.టి.ఎఫ్‌. సమీక్ష కొనసాగు తున్నందువల్ల ఈ కీలక దశలో ఆ విషయాల మీద అవగాహన ఉన్న మిశ్రానే కొనసాగడం అవసరం అని కూడా సుప్రీంకోర్టు భావించింది. కానీ ప్రభుత్వం మాత్రం మిశ్రా విషయంలో మొండికేస్తోంది. సుప్రీం కోర్టుఆదేశం నీటిమీదరాత అయిపోయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ రాజ్యాంగ వ్యవస్థా కాదు, చట్టబద్ధ సంస్థా కాదు. అది ఆర్థిక మంత్రిత్వ శాఖలో అంతర్భాగం. మిశ్రాస్థానంలో మరోఅధికారి దొరకడం దుర్లభం కాదు. కావాలనుకుంటే ఆయనను సలహాదారుగా పెట్టుకోవచ్చు.
సంజయ్‌ మిశ్రా స్థానంలో మరెవరూ దొరకడం లేదు, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌ విషయాలన్నీ ఆయనకు మాత్రమే తెలుసు అన్నది వితండ వాదమే. దిల్లీ ప్రభుత్వ ఉన్నతోద్యోగుల నియామకం, బదిలీల అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు చెప్తే కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పును వమ్ము చేయడానికి వెంటనే ఆర్డినెన్సు జారీ చేసింది. ఈ అధికారాలన్ని దిల్లి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కే ఉంటాయని కేంద్రప్రభుత్వ వాదన. దిల్లీ మిగతారాష్ట్రాలలాగా సంపూర్ణమైన రాష్ట్రం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి దిల్లీకి సంబంధించి మూడు విధులు ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసులు, భూమి మీద దిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారమూలేదు. శాంతిభద్రతలు పర్యవేక్షించ డానికి దిల్లీ పోలీసుల దగ్గర పోలీసు బలగమే లేదు. దీనికోసం దిల్లీ ప్రభుత్వం కేంద్రంమీద ఆధార పడవలసిందే. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని రాష్ట్రాలలోనూ తమ ఆధిపత్యం కొనసాగుతుండగా దిల్లీ మీద తమ పెత్తనం లేకపోవడం మొదటి నుంచీ బీజేపీకి కంటగింపుగానే ఉంది. దిల్లీ ముఖ్యమంత్రి పదవి తమ చేతిలోలేదు కనక కేజ్రీవాల్‌ ను నామమాత్ర స్థానానికి కట్టడి చేయాలన్నది బీజేపీ ఆలోచన. అదానీ, సెబీ అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు పరిశీలించ వలసిఉంది. ఈవిషయంలో సుప్రీంకోర్టు ఒకకమిటీ నియ మించింది. ఆ కమిటీ నివేదిక త్వరలో రానుంది. అదానీ, సెబీ అంశాలపైకూడా సుప్రీంకోర్టు దృఢమైన వైఖరే అనుసరిస్తోంది. ఇదీ మోదీ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. ఈ మూడు అంశాలపై సుప్రీంకోర్టు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వంలో చలనంలేకపోగా ఆ ఉత్తర్వులను ఎలా అధిగమించాలి అని దారులు వెతుకుతోంది. ఈ కమిటీని తామే నియమిస్తామన్న కేంద్రప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఏది అడిగినా ప్రభుత్వం సీల్డ్‌ కవర్లో అందించాలన్న సర్కారు వైఖరిని కూడా అత్యున్నతన్యాయస్థానం సాగనివ్వడంలేదు. ప్రధాన న్యాయ మూర్తి చంద్రచూడ్‌ ఉదారవాదే కాక న్యాయమార్గపాలన ఉండాలని పట్టుబడుతున్నారు. ఇదీ మోదీ సర్కారుకు కంటిలోని నలుసుగానే ఉంది.
సకల వ్యవస్థలనూ తమగుప్పెట్లోకి తెచ్చుకున్న మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టును లొంగదీయడం ఇప్పటిదాకా సాధ్య పడలేదు. పైగా ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరవాత కూడా కొన్ని నెలలు పదవిలో ఉంటారు. ఆందువల్ల మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మోదీ ప్రభుత్వానికీ, సుప్రీంకోర్టుకు మధ్య పొంతన కుదిరే అవకాశం కనిపించడంలేదు. ప్రధాన న్యాయమూర్తి తన ధోరణిని ఎంత కాలం కొనసాగించగలరు అన్నదే ప్రశ్న. అందుకే ఇది ఆయనకు అగ్ని పరీక్ష.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img