Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బాలల మీద కిరాతకం

గత శనివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక విశ్రాంతి (ఆటలాడుకునే) కేంద్రంలో హఠాత్తుగా అగ్నిప్రమాదం జరగడంతో 33 మంది మరణించారు. వీరిలో తొమ్మిదిమంది బాలలు. ఆ తరవాత కొన్ని గంటల్లోనే దిల్లీలోని వివేక్‌ విహార్‌లో ఒక బాలల ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు అగ్నికి ఆహుతయ్యారు. రాజ్‌కోట్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి ఆ ఆవరణలో వెల్డింగ్‌ పనులు జరుగుతుండగా నిప్పు అంటుకుంది అన్నది ప్రాథమిక సమాచారం. దిల్లీలోని బాలల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరగడానికి ఆక్సీజన్‌ సిలిండర్‌ పేలడం కారణం అంటున్నారు. రాజ్‌కోట్‌లో అగ్ని ప్రమాదం జరిగినచోట అగ్ని ప్రమాదాలు నిరోధించడానికి, లేదా ప్రమాదం జరిగినప్పుడు ఆదుకోవడానికి కావలసిన కనీస సదుపాయాలు కొరవడ్డాయి. అక్కడ ఆగ్నిమాపక పరికరాలు, అత్యవసర పరిస్థితిలో బయటకు వెళ్లే మార్గాలు, ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడున్న వారిని కాపాడడానికి సుశిక్షితులైన సిబ్బంది లేరు. రాజ్‌కోట్‌లోని విశ్రాంతి కేంద్రంలో జరిగిన ప్రమాదాన్ని హైకోర్టు అది మనుషుల కారణంగా జరిగిన ప్రమాదం అని వ్యాఖ్యానించింది. తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించారంటున్నారు. ఆ కేంద్రం నడపడానికి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయో లేదో, అగ్నిమాపక దళం నుంచి అభ్యంతరం లేదన్న సర్టిఫికెట్‌ ఉందో లేదో కూడా తేలవలసి ఉంది. దిల్లీలోని బాలల ఆసుపత్రిలో కూడా ఇదే రకమైన లోపాలు, ఉల్లంఘనలు ఉన్నాయంటున్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా ఇలాంటి వ్యవస్థలను నడపడానికి అనుమతించిన అధికారుల బాధ్యతా రాహిత్యమూ తక్కువేమీ కాదు. గుజరాత్‌ లోని ఇలాంటి కేంద్రాలన్నింటినీ ఈ దుర్ఘటన జరిగిన తరవాత మూసేశారు. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించవచ్చు. కానీ అది తాత్కాలిక ఉపశమనమే. కావాల్సింది ఇక ముందు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయన్నది ముఖ్యం. ఈ ప్రమాదాలు గుజరాత్‌ కో దిల్లీకో పరిమితమైనవి కావు. దేశంలో ఎక్కడైనా జరగొచ్చు. ఉదాహరణకు మహారాష్ట్రలోని డోంబివిల్లీలోని ఒక రసాయనాల పరిశ్రమలో ఇటీవలే జరిగిన ప్రమాదంలో పది మంది మరణించారు. ఇలాంటి ప్రమాదాలు ఎక్కడ జరిగినా అపాయకరమే. ప్రమాదాల్లో జనం ప్రాణాలు కోల్పోవడం ఒక ఎత్తయితే వివిధ సంక్షేమ పథకాల అమలులో ఉన్న లోపాల వల్ల పసి కూనలు ప్రాణాలు కోల్పోవడం అంతకన్నా విషాదకరం. గత ఏప్రిల్‌ పదకొండున జార్ఖండ్‌లో ఓ నడివయస్కుడు ఒక రోజు వయసుగల తన పసికందును తీసుకుని రాంచీలోని ఆసుపత్రికి వచ్చాడు. గుంల్లా, లోహర్దగాలోని రెండు ప్రైవేటు ఆసుపత్రులు ఆ పసికందుకు చికిత్స చేయడానికి నిరాకరించాయి. ఆ తండ్రి ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులచుట్టూ తిరిగే సరికి ఆ పసికందు ప్రాణాలు పోయాయి. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరోగ్య పథకం అని మోదీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌-ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఇలాంటి సందర్భాలలో ప్రాణాలు కాపాడడంలో విఫలమవుతోంది. ఇలాంటి సంఘటనలు డజన్లు ఏకరువు పెట్టొచ్చు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ఎంత దొడ్డదైనా అవసరానికి ప్రజలకు ఉపయోగపడడం లేదన్నది వాస్తవం.
దిల్లీలోని వివేక్‌విహార్‌లో ఉన్న బేబీకేర్‌ న్యూ బార్న్‌ ఆసుపత్రిలో పసికందుల మరణాలు కొత్త కాదు. ఆ ఆసుపత్రి యజమాని డా.నవీన్‌ ఖిచి మీద చాలాకాలం నుంచి బోలెడు ఆరోపణలున్నాయి. ఆయన మీద క్రిమినల్‌ కేసులూ నమోదు అయినాయి. అయినా పరిస్థితి మారలేదని శనివారం ఏడుగురు బాలలు ప్రాణాలు వదలడంవల్ల రుజువు అవుతోంది. ఈ ఆసుపత్రి దిల్లీ నర్సింగ్‌ హోంల నమోదు చట్టం కింద నమోదే కాలేదట. డా.ఖిచి ఇష్టారాజ్యం, అధికారుల నిర్లక్ష్యం బాలల ప్రాణాలను గాలిలో కలిపేస్తుంటే నిలవరించే నాథుడే కనిపించడంలేదు. 2021 లోనే ఆ డాక్టర్‌ మీద కేసు నమోదైంది. ఈ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగే సమయానికి 12 మంది బాలలున్నారు. అందులో ఒక పసికూన ప్రాణాలు ప్రమాదం జరగడానికి ముందే పోయాయి. మిగతా ఆరుగురిని మరో ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఆసుపత్రికీ అగ్నిమాపక విభాగం నుంచి అభ్యంతరం లేదన్న సర్టిఫికెట్‌ లేదు. 2021లో ఖిచీ మీద దాఖలైన కేసులో ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు అయింది. ఆసుపత్రిలో చేరిన ఒక పసికందుకు గాయాలైనాయన్న ఆరోపణా ఉంది. ఆసుపత్రిలోని నర్సు ఆ పాపను కొట్టినందువల్ల గాయమైందంటున్నారు. చికిత్స మాట అటుంచి పసికందుల మీద క్రౌర్యం కూడా అక్కడ విచ్చలవిడిగా కొనసాగుతుందనిపిస్తోంది. తాజా దుర్ఘటన తరవాత పోలీసులు డా.ఖిచీ మీద ఉన్న పాత కేసులు తవ్వి తీస్తున్నారు. యోగీ ఆదిత్యనాథ్‌ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ పూర్‌ బి.ఆర్‌.డి. వైద్య కళాశాల ఆసుపత్రి అయితే బాలల పాలిటి మృత్యు కుహరంలా మారింది. ఒక్క 2017వ సంవత్సరంలోనే ఈ ఆసుపత్రిలో కనీసం 1,317 మంది బాలలు ప్రాణాలు కోల్పోయారు. ఇది అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అంటున్నారు. కానీ 2017లో ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ లేక 63 మంది బాలలు మరణించారు. ఈ సంఘటన దేశమంతటినీ రెండు కారణాలవల్ల కుదిపేసింది. మొదటికి ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందుబాటులో లేక పసి పిల్లలు పిట్టల్లా రాలిపోవడం. ఆక్సిజన్‌ సరఫరాచేసే సంస్థకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద మొత్తంలో బాకీ పడనందువల్ల ఆ సంస్థ ఆక్సిజన్‌ సరఫారా ఆపేసింది. ఈ విపత్కర పరిస్థితి నుంచి పిల్లలను కాపాడడం కోసం డా.కఫీల్‌ ఖాన్‌ సొంత డబ్బులు వెచ్చించి అప్పటికప్పుడు 250 ఆక్సిజన్‌ సిలిండర్లు సమకూర్చి వైద్యుడిగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు. ఈ పని చేసినందుకు ఆయనను అభినందించాల్సింది పోయి యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆయనను ముప్పు తిప్పలుపెట్టింది. కేసులు నమోదుచేసింది. ఆయనను జైలుకు పంపించింది. తన లోపాన్ని కప్పి పుచ్చుకోవడానికి యోగీ ప్రభుత్వం ఇంత కిరాతకంగా వ్యవహరించింది. ప్రభుత్వం ఆక్సిజన్‌ సరఫరాకు తగిన ఏర్పాట్లు చేయడంలో తన బాధ్యత విస్మరించింది. పైగా ఆదుకున్న డాక్టర్‌ మీద కసి తీర్చుకుంది. వ్యక్తిగతంగా కష్ట నష్టాలకు ఓర్చి తమ వృత్తి ధర్మంగా భావించి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించే డాక్టర్ల మీద కేసులు మోపడం అంటే వారిని నిరుత్సాహ పరచడమే. ఆయుష్మాన్‌ భారత్‌ గురించి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఈ పథకం కింద చికిత్స చేసిన ఆసుపత్రులకు సమయానికి డబ్బులు చెల్లించకుండా ఆ పథకాన్నే అపహాస్యం చేస్తోంది. ఆ పథకం మీద ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తోంది. ఆసుపత్రులు మృత్యు వాటికలు కావడం అంటే ఇదే. ఇది బాలల మీద కొనసాగిస్తున్న కిరాతకం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img