London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

మోహన్‌ భగవత్‌ అంతరార్థం

ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ ఇటీవల మాట్లాడు తున్న తీరు చూస్తే పులి చారికలు సన్నబడుతున్నాయేమో అనిపి స్తోంది. ముస్లింలపట్ల సంఫ్‌ు పరివార్‌ వైఖరి మారుతోందేమోనని, ముస్లింల విషయంలో విద్వేషం విడనాడే దిశగా సంఫ్‌ు ప్రయాణి స్తోందని భ్రమపడే అవకాశమూ కనిపిస్తోంది. సోమవారంనాడు ఆర్‌.ఎస్‌.ఎస్‌. అనుబంధ సంస్థ అయిన ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ సమావేశంలో మోహన్‌ భగవత్‌ మాటలు వింటే ముస్లింలపై ఆర్‌.ఎస్‌.ఎస్‌. ద్వేషం తగ్గుతోందని అనిపించడానికీ వీలుంది. ‘‘భారత్‌లోని హిందువులు-ముస్లింలు ఒకే వారసత్వం నుంచి వచ్చినవారు. మా దృష్టిలో హిందువు అంటే మాతృభూమి, ప్రాచీన కాలం నుంచి వారసత్వంగా లభించిన సంస్కృతి. భాష, కులం, మతంతో సంబంధం లేకుండా హిందువు అన్న మాట అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కరు హిందువే. అందుకే మేం భారతీయ పౌరులందరూ హిందువులే అంటాం. ఇక్కడ ఇతరుల మతాన్ని అగౌరవ పరచరు. అయితే మనం మాట్లాడవలసింది ముస్లింల ఆధిపత్యం గురించి కాదు. భారత్‌ ఆధిపత్యం గురించి. దేశం అభివృద్ధి చెందాలంటే అందరం కలిసికట్టుగా పని చేయాలి.’’ ఈ మాటల్లో అభ్యంతర పెట్టవలసింది ఏమీ కనిపించకపోవచ్చు. ఈ మాటలు హిందుత్వ వాదులు చెప్పినవి అంటే నమ్మలేం. ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ నోటి నుంచి ఈ మాటలు వెలువడ్డాయంటే అస్సలు నమ్మలేం. కానీ ఇవి మోహన్‌ భగవత్‌ మాటలే. అనుమానించ డానికి అవకాశమే లేదు. ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ సమావేశానికి కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ లాంటి వారు కూడా హాజరయ్యారు. ముస్లింలలో పేరుకుపోయిన భయాన్ని పారదోలడానికి మోహన్‌ భగవత్‌ నిరంతరం కృషి చేస్తున్నారనిపిస్తోంది. ఆయన హిందువులను కీర్తించిన సందర్భాలు లేకపోలేదు. గత జనవరిలో ఒక పుస్తకావిష్కరణ సమావేశంలో ‘‘హిందువులు స్వభావ రీత్యానే దేశభక్తులు. వారు ఎన్నడూ భారత్‌కు వ్యతిరేకులు కాలేరు’’ అని భగవత్‌ అనడం ఫక్తు ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకుడి ధోరణే. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఇదే సంవత్సరం జులై నాలుగున ‘‘మూక హత్యలకు పాల్పడే వారు హిందుత్వకు వ్యతిరేకులు’’ అన్నప్పుడు భగవత్‌ ఈ హేయమైన దాడులను ఈసడిస్తున్నారనీ, సంఫ్‌ు పరివార్‌ ధోరణి మారుతోందని భావించిన వారు ఉన్నారు. మోహన్‌ భగవత్‌ ఇటీవలి మాటలు వింటుంటే హిందుత్వ సిద్ధాంత ప్రవక్త వీర సావర్కర్‌ భావాలకు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్న అను మానమూ కలుగుతుంది. భగవత్‌ మాటలు విన్నప్పుడు ఆయన హిందుత్వను నిర్వచిస్తున్న తీరు స్వామీ వివేకానందుడి ఆలోచన ధోరణికి సన్నిహితంగా ఉందేమోననిపిస్తుంది. ‘‘హిందు రాష్ట్ర అంటే ముస్లింలకు స్థానం ఉండదని కాదు. ఒక వేళ అదే జరిగితే అది హిందుత్వే కాదు. హిందుత్వ అంటే వసుధైవ కుటుంబం’’ అని భగవత్‌ 2018లో అన్నారు. ఇదంతా చూస్తే ఆర్‌.ఎస్‌.ఎస్‌. వైఖరి మారుతోందని, మునుపటి కరకు దనం, తీవ్రత లేదని అనిపిస్తుంది. ఆర్‌.ఎస్‌. ఎస్‌. నాయకులలో పట్టు విడు పులు ఉన్న వారు గతంలోనూ ఉన్నారు. హిందుత్వ సిద్ధాంత నిర్వచనంలో భిన్న ధోరణులు అనుసరించిన వారూ కనిపిస్తారు. ఉదాహరణకు బాలా సాహెబ్‌ దేవరస్‌ హిందూత్వ వర్గాల్లోనే తిరుగుబాటుదారు. ఆయనకు హిందూ సంప్రదాయాల ఆచరణ అంత ముఖ్యమైందిగా ఉండేది కాదు. ఎం.ఎస్‌. గోల్వాల్కర్‌తో విభేదాల కారణంగా దేవరస్‌ ఎనిమిదేళ్లు ఆర్‌.ఎస్‌. ఎస్‌.కు దూరంగా ఉన్నారు. దేవరస్‌ నిజానికి రాజకీయ అభిప్రాయాలు మెండుగా ఉన్నవారు. దేవరస్‌ తరవాత రాజకీయ లక్షణాలను బహిరంగంగా వ్యక్తం చేసే నాయకుడు ప్రస్తుత ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ మాత్రమే. ఇతర మతాల వారికి కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌. ద్వారాలు తెరిచిన మొదటి వ్యక్తి కూడా దేవరసే. ఇప్పుడు మోహన్‌ భగవత్‌ మరో అడుగు ముందుకు వేసి భారతీయులు అందరూ హిందువులే అంటున్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఇస్లాంకు వ్యతిరేకమైంది అన్న అభిప్రాయం తొలగించడానికే ఆర్‌.ఎస్‌.ఎస్‌. తన పొత్తిళ్లలో రాష్ట్రీయ ముస్లిం మంచ్‌ను ఏర్పాటు చేసింది. భగవత్‌ సామరస్యంగా కనిపించే మాటలు మాట్లాడిరది ఆ విభాగం సమావేశంలోనే.
ముస్లింలు లేకుండా హిందుత్వను ఊహించను కూడా లేం అని సాక్షాత్తు ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత అనడం ఆర్‌.ఎస్‌.ఎస్‌. తత్వం తెలుసునను కుంటున్న వారందరినీ అవాక్కుల్ని చేస్తుంది. భగవత్‌ ఇప్పుడు చెప్తున్న మాటలు చూస్తే సావర్కర్‌ ప్రతిపాదించిన ‘‘ద్విజాతి సిద్ధాంతాన్ని’’ ఆర్‌.ఎస్‌. ఎస్‌. విడనాడిరదన్న అభిప్రాయమూ కలగవచ్చు. ముస్లింలు లేకుండా దేశమూ లేదు, హిందుత్వే లేదు అంటే ఇక ద్విజాతి సిద్ధాంతానికి తావెక్క డిది? హిందువులది ముస్లింలది ఒకే వారసత్వమని, పూర్వీకులు ఒక్కరే అని మోహన్‌ భగవత్‌ చెప్పే మాటలు ఆర్‌.ఎస్‌.ఎస్‌. మౌలిక సిద్ధాంతానికే విరుద్ధమైనవిగా కూడా కనిపించవచ్చు. ఇందులో అంతరార్థం గమనిస్తే భగవత్‌ మాటల్లో ఆంతర్యం అర్థం అవుతుంది. భగవత్‌ ఉద్దేశం ప్రకారం ముస్లింలు, క్రైస్తవులు ఒకప్పుడు హిందువులే. కానీ వారు ఇతర మతాలను అనుసరించడం మొదలు పెట్టిన తరవాత వారి ఆరాధనా పద్ధతులు, పండగలు, పబ్బాలు మారిపోయిన తరవాత వారి జీవిత దృక్పథమూ రూపాంతరం చెందింది. మోహన్‌ భగవత్‌ ముస్లింల విషయంలో విద్వేషం వెళ్లగక్కడం లేదు అని పై పైన చూస్తే నమ్మ బుద్ధేస్తుంది. కానీ భారతీయులు, క్రైస్తవులు మతం మార్చుకోవడంవల్లే ఆ మతాల వారయ్యారని, నిజానికి వారు ఒకప్పుడు హిందువులే అన్నది భగవత్‌ ఆంతర్యం. అంటే భగవత్‌ శతాబ్దాలుగా ఇస్లాం లేదా క్రైస్తవ మతం అనుసరిస్తున్న వారిని ఆ మతాల వారిగా గుర్తించి గౌరవించడానికి సిద్ధంగా లేరు. మన దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు మతం మారినందువల్లే ఆ మతాల వారైపోయారని అంటున్నారన్నమాట. ఇది బహుళత్వాన్ని అంగీకరించడానికి నిరాకరించ డమే. మోహన్‌ భగవత్‌ మాటల్లో కనిపించే మార్పు సంఫ్‌ు పరివార్‌ కుదురు ప్రవర్తనలో ఎక్కడా కనిపించడం లేదు. అదే నిజమైతే మూక దాడులు జరిగేవే కావు. ముస్లింల పట్ల విద్వేషం వెర్రి తలెత్తేదే కాదు. తమ ఛత్ర ఛాయల కింద నడుస్తున్న మోదీ ప్రభుత్వాన్ని హిందూత్వ పేరిట జరుగుతున్న ఆగడాలను కట్టడి చేయాలని భగవత్‌ ఆదేశించిన ఉదంతం ఒక్కటీ లేదు. ఓట్ల, సీట్ల రాజకీయాలలో ముస్లింలను ఖాతర్‌ చేయడం మోదీ హయాంలో పూర్తిగా ఆగిపోయింది. వారి ఓట్లు లేకపోయినా ఫరవా లేదన్న ధీమా కలిగింది. అందుకే ముస్లింలకు ఒక్క సీటైనా కేటాయించడం లేదు. హిందువులను సమీకరించడం మీదే ఇప్పుడు సంఫ్‌ు పరివార్‌ దృష్టి. మోహన్‌ భగవత్‌ మాటలకు అర్థం అదే. హిందువులను హిందుత్వ వాదులుగా మార్చే ప్రయత్నాలు అడ్వాణీ రథ యాత్రతో ప్రారంభమైనాయి. ఆ తరవాతే తాము హిందువులమన్న స్పృహ చాలా మందిలో పెరిగింది. ఆ మేరకు ముస్లింలను ద్వేషించడమూ ఎక్కువైంది. హిందువులను హిందుత్వ వాదులుగా మార్చడమే సంఘ పరివార్‌ ప్రయత్నం. కాదు కుట్ర. భగవత్‌ ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img