విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ఎన్నికల సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మహిళల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం దీపావళి రోజున ఇంటింటికి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ట్రైకర్ చైర్మన్ బొరగం. శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను కూటమి ప్రభుత్వ నాయకుల ఆధ్వర్యంలో మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొరగం. శ్రీనివాసరావు రానున్న రోజుల్లో మిగతా హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పారేపల్లి. రామారావు, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘాలాదేవి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల. వెంకటరమణ, మండల పార్టీ అధ్యక్షులు పారేపల్లి నరేష్, పట్టణ అధ్యక్షులు జేష్ట. రామకృష్ణారావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు మాదేపల్లి. శ్రీనివాస్, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు బొమ్మ. బాబు, బలుసు. నాగేశ్వరరావు, గొలిశెట్టి .శ్రీనివాసరావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.