London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

అగ్నివీర్‌పై కేంద్రానివిఅర్ధసత్యాలు

. అజయ్‌ కుమార్‌ కుటుంబానికి ఇచ్చినది బీమా డబ్బు… పరిహారం కాదు
. తప్పుదోవ పట్టించేలా సర్కార్‌ వ్యాఖ్యలు బ వత్తాసు పలికిన సైన్యం

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీరుడు అజయ్‌ కుమార్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చినట్లు కేంద్రప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా దేశాన్ని తప్పుదోవ పట్టించింది. అర్ధసత్యాలు పలికింది. సైన్యం కూడా వత్తాసు పలికింది. అజయ్‌ కుమార్‌ కుటుంబానికి ఇచ్చినది బీమా డబ్బు తప్ప పరిహారం కాదని నిజనిర్థారణ జరిగింది.

న్యూదిల్లీ : పార్లమెంటులో అగ్నివీర్‌ పథకం మీద అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ సాగింది. అగ్నివీరులను సైనికులుగా పరిగణించడం లేదని, సైన్యానికి వ్యతిరేకమైన ఈ పథకాన్ని రద్దు చేయాలని విపక్ష నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. అమర జవానుకు రూ.కోటి పరిహారం చెల్లించినట్లు కేంద్రం తరపున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడిరచారు. ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లోనూ సాగింది. సైన్యం స్పందించేలా చేసింది. జనవరి 18న జమ్మూకశ్మీర్‌లో మందుపాతర పేలి అగ్నివీర్‌ అజయ్‌ కుమార్‌ అమరుడయ్యారు. అనంతరం ఆయన కుటుంబానికి కొంత డబ్బు అందింది. అది ప్రభుత్వ పరిహారమా లేక బీమా డబ్బా అన్నది అసక్తికరంగా మారింది. దీంతో నిజనిర్థారణ జరిగింది.
అగ్నివీరుడి కుటుంబానికి రూ.కోటి చెల్లించినట్లు కేంద్రప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని వెల్లడైంది. కోటి రూపాయలు ఆ కుటుంబానికి అందాయి కానీ అవి అమర సైనికులకు ఇచ్చే బీమా మొత్తమని తేలింది. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయే సైనికులకు ఇచ్చే ప్రయోజనాలు అగ్నివీరులకు ఉండవు. అగ్నివీర్‌ కుటుంబానికి చెల్లింపులపై సైన్యం వివరణను బట్టి రూ.50లక్షలను ఎస్‌బీఐ బ్యాంకు చెల్లించిందని వెల్లడైంది. ఇంకో రూ.39వేలను సైన్యం చెల్లించిందని తెలిసింది. సైనిక సంక్షేమ నిధి నుంచి ఇవ్వాల్సిన రూ.8లక్షలతో పాటు పరిహార మొత్తం రూ.44 లక్షలను ఇంకా చెల్లించలేదు. అలాగే ఒప్పందం ప్రకారం కాంట్రిబ్యూటరీ సేవా నిధి నుంచి రూ.2.3లక్షలను ఆర్మీ చెల్లించాల్సి ఉంది. ఇక ‘బ్యాలెన్స్‌ ఆఫ్‌ పే’ కింద మరో రూ.13లక్షలు కూడా ఆ కుటుంబానికి ఇవ్వలేదు. బీమా మొత్తాన్ని పరిహారంగా చూపే ప్రయత్నాన్ని చేయడం ద్వారా సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం, సైన్యం యత్నించినట్లు నిజ నిర్థారణ ద్వారా తేలింది.
సైన్యం వివరణ
అగ్నివీర్‌ అజయ్‌ కుటుంబానికి రూ.98.39లక్షలను ఇప్పటికే చెల్లించినట్లు భారత సైన్యం అధికార ప్రతినిధి ‘ఎక్స్‌’లో వివరణ ఇచ్చారు. పరిహారం, ఇతర ప్రయోజనాలకు సంబంధించి రూ.67లక్షలు ఇవ్వాల్సి ఉందని, దానిని పోలీసు వెరిఫికేషన్‌ తర్వాత చెల్లిస్తామని చెప్పారు. మొత్తంగా రూ.1.65కోట్లు ఆ కుటుంబానికి అందుతాయన్నారు. అయితే ఈ మొత్తాన్ని ఎక్కడ కూడా ‘బీమా’గా వ్యవహరించకపోవడం గమనార్హం.
ప్రభుత్వం, సైన్యం తీరు సరి కాదు: కల్నల్‌ అమిత్‌ కుమార్‌
అజయ్‌ కుమార్‌ కుటుంబానికి ఇచ్చినది బీమా డబ్బు తప్ప ప్రభుత్వ పరిహారం కాదని ఆర్మీ సీనియర్‌ కల్నల్‌ అమిత్‌ కుమార్‌ ‘ఎక్స్‌’ ద్వారా స్పష్టంచేశారు. ఆ డబ్బును తామిచ్చినట్లుగా సైన్యంగానీ ప్రభుత్వంగానీ చెప్పుకోవడం సరికాదన్నారు.
‘రక్షణ మంత్రి స్థూలంగా రూ.కోటి అని చెప్పారు, ఇందులో రూ.48లక్షలు బీమా డబ్బు. బీమా డబ్బును ప్రభుత్వమిచ్చే పరిహారం కింద జమచేయలేము. అవార్డు లేక రివార్డుగా పరిగణించలేము’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఓ సైనికుడి జీతాన్ని అగ్నీవీర్‌కు ఇచ్చేదానితో పోల్చి నిజమేమిటో మీకే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ‘సమాన పనికి సమాన వేతనం ఉండాలి. ముఖ్యంగా ప్రమాదం సామానస్థాయిలో ఉన్నప్పుడు’ అంటూ కల్నల్‌ అమిత్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. ఇదిలావుంటే, రూ.50లక్షలు ఎస్‌బీఐ ఇచ్చింది. ఎస్‌బీఐలో వేతన ఖాతాలుగల ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉండే గ్రూపు ఇన్సూరెన్స్‌ కింద ఈ మొత్తాన్ని అందించింది. మరో రూ.48లక్షలు ఆర్మీ గ్రూప్‌ బీమా ద్వారా వచ్చాయి’ అని ఎక్స్‌ వినియోగదారు ఒకరు వివరించారు. సైన్యం రూ.38వేలు ఇచ్చిందని, మిగతాది ప్రభుత్వ బీమా, బ్యాంకు బీమా మొత్తమన్నారు. పరిహారం రూపేణ రూ.44లక్షలు, ఆర్మీ సంక్షేమ నిధి నుంచి రూ.8లక్షలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఒప్పందం ప్రకారం అగ్నివీరుడికి రూ.13లక్షలు రావాలని, కాంట్రిబ్యూటరీ సేవ నిధి నుంచి రూ.2.3లక్షలను సైన్యం ఇవ్వాల్సి ఉందని నివేదికలు కూడా పేర్కొన్నాయి.
రాహుల్‌, రాజ్‌నాథ్‌ ఏమన్నారంటే…
జులై 1న రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతా తీర్మానంపై చర్చలో భాగంగా అగ్నిపథ్‌ పథకాన్ని రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. సైనికులను వాడుకొని వదిలేసేలా ఈ పథకం ఉన్నదని విమర్శించారు. శాశ్వత సైనికుడు, తాత్కాలిక అగ్నివీరుడికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లు తెలిపారు. రక్షణ మంత్రి జోక్యం చేసుకొని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీరుల కుటుంబాలకు రూ.కోటి పరిహారాన్ని కేంద్రప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. రాహుల్‌ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంటును తప్పుదోవ పట్టించే ప్రయత్నానికిగాను ఆయన క్షమాపణ చెప్పాలని అధికార పక్షం డిమాండ్‌ చేసింది. దీంతో ఇది రాజ్‌నాథ్‌ సింగ్‌ అభిప్రాయం… వాస్తవమేమిటో అగ్నివీరులకు తెలుసని ప్రతిపక్ష నేత దీటైన బదులిచ్చారు. అగ్నివీరులకు పరిహారం గురించి పార్లమెంటులో రక్షణ మంత్రి అబద్ధం చెప్పారంటూ రాహుల్‌ జులై 3న ఎక్స్‌లో వీడియో పెట్టారు. అజయ్‌ కుమార్‌ తండ్రి మాట్లాడుతున్న వీడియో క్లిప్‌ను పోస్టు చేశారు. పంజాబ్‌ ప్రభుత్వం నుంచి కొంత అందింది కానీ కేంద్రం నుంచి ఏమీ లభించలేదని అజయ్‌ కుమార్‌ తండ్రి చెబుతుండటం అందులో ఉంది. లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ మాకు ఎలాంటి సందేశంగానీ డబ్బుగానీ లభించలేదని కూడా ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img