London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 21, 2024
Monday, October 21, 2024

అధికారం రాష్ట్రాలదే

ఎస్సీ, ఎస్టీ కోటాల ఉప వర్గీకరణపై సుప్రీం

న్యూదిల్లీ: షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వర్గీకరణకు మార్గం సుగమమైంది. ఎస్సీ, ఎస్టీ కోటాల ఉప వర్గీకరణను సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పునిచ్చింది. రిజర్వుడ్‌ విభాగాల్లో ఎస్సీ, ఎస్టీల కోసం కోటాల ఉప వర్గీకరణకు అధికారం రాష్ట్రాలకు ఉందని సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెల్లడిరచింది. తాజా తీర్పు ప్రకారం తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. అణగారిన వర్గాలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేలా రిజర్వ్‌డ్‌ విభాగాల్లో ఉప వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు తెలిపింది. రాష్ట్రాలు ఇష్టానుసారంగా కాకుండా సముచిత సమాచారం, ఆమోదయోగ్యమైన పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం వెల్లడిరచింది. అయితే ధర్మాసనంలోని ఆరుగురు జడ్జిలు… ఉప వర్గీకరణను సమర్థించగా, ఒకరు మాత్రం వ్యతిరేకించడంతో 6:1గా తీర్పు వెలువడిరది. సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ బీవీ గవాయి, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిథల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మతో కూడిన ఏడుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం వేర్వేరుగా తీర్పులు ఇచ్చారు. సీజేఐ తనతో పాటు జస్టిస్‌ మిశ్రా తరపున తీర్పు రాయగా, మిగతా నలుగురు తమ తీర్పులు ఇచ్చారు. జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం మిగతా ఆరుగురితో విభేదిస్తూ తీర్పునిచ్చారు. ఉప వర్గీకరణ ఆమదయోగ్యం కాదని పేర్కొన్నారు. పంజాబ్‌, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉప వర్గీకరణ కోసం ఉన్న చట్టాల చట్టబద్ధతనూ సర్వోన్నత ధర్మాసనం సమర్థించింది. ఎస్సీ విభాగంలో వర్గీకరణ రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధమని ‘ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌’ కేసులో సుప్రీంకోర్టు 2004 ఇచ్చిన తీర్పును పూర్తిగా తోసిపుచ్చేలా తాజా తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించింది. పంజాబ్‌ ఎస్సీ, బీసీల (సేవల్లో రిజర్వేషన్‌) చట్టం`2006 చట్టబద్ధతకు సంబంధించిన కేసుతో ముడిపడి ఉన్న తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎస్సీలు సజాతీయ (హోమోజీనియస్‌) వర్గం కాదని, రిజర్వేషన్లలో 15శాతం కేటాయించేలా వీరి ఉప వర్గీకరణను ప్రభుత్వాలు చేయొచ్చని వెల్లడిరచింది. వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ/ఎస్టీ వర్గాల వారు ఎదగలేకపోతున్నారని, ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతిస్తుందని తీర్పులో సుప్రీంకోర్టు వెల్లడిరచింది. ఇదే క్రమంలో 2004నాటి ఈవీ చిన్నయ్య తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఉపవర్గీకరణ చేసుకొనేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ తీర్పు వెలువరించింది.

స్వాగతిస్తున్నాం: సీపీఐ
న్యూదిల్లీ : ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల ఉప వర్గీకరణ సమంజసమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శివర్గం స్వాగతించింది. ఈ మేరకు ఒక ప్రకటన వెలువరించింది. వెనుకబడిన వర్గాలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు మార్గాన్ని సుప్రీంకోర్టు కల్పించిందని పేర్కొంది. సీపీఐ కూడా దీర్ఘకాలంగా దీనినే కోరుతోందని తెలిపింది. అసమానతలు, వివక్ష, వెనుకబాటుతనం, ప్రాతినిధ్యం వంటి వాటిలో ఉన్న వ్యత్యాసాలను సరిగ్గా అంచనా వేయడంతో సమాజంపై, వ్యవస్థలు/రాజకీయాలపై ఈ తీర్పు ప్రభావం ఏ మేరకు చూపుతోందన్నది నిశితంగా గమనించాలని సూచించింది. ఇదే క్రమంలో కులగణన నిర్వహణను తీర్పు సూచించిందని తెలిపింది.
కులాలపై సరైన డేటా లేకుండా, వివిధ స్థాయిల్లో ఉన్న ప్రాతినిధ్యంపై అవగాహన లేకుండా వివిధ సామాజిక వర్గాల కోటాల ఉపవర్గీకరణ సాధ్యం కాదని పేర్కొంది. దేశంలో ప్రస్తుతమున్న సామాజిక, ఆర్థిక అసమానతలను అంచనా వేసేందుకు కులగణన తక్షణాశ్యమని సీపీఐ సూచించింది. అందుకోసం కుల గణన నిర్వహణను డిమాండ్‌ చేస్తున్నట్లుగా తెలిపింది. సామాజిక న్యాయ ఫలాలు అత్యంత వెనుకబడిన వర్గాలకు అందడం అవసరమని, అందుకు సీపీఐ పోరాటాలు కొనసాగుతాయని ప్రకటన తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img