London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

నల్లబారిన తెల్లబంగారం

పత్తి రైతుకు కలిసిరాని కాలం
వర్షాలతో పంట నష్టం
చెట్లమీదే కుళ్లి నేలరాలుతున్న కాయలు
పత్తి తీయక ముందే మొలకెత్తుతున్న గింజలు
నష్టాలతో పత్తి రైతు విలవిల

రైతన్నకు అన్నీ కష్టాలే..ఒకసారి అనావృష్టి`మరోసారి అతివృష్టి వెంటాడుతోంది. పత్తి రైతుకు కాలం కలిసి రావడంలేదు. ఏటా దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. భారీవర్షాలతో పత్తి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వాతావరణ పరిస్థితులకు తోడు పత్తి తీసే సమయంలో అధిక వర్షాలకు చేలన్నీ తెగుళ్ల బారిన పడ్డాయి. చెట్ల మీదే కాయలు కుళ్లి నేల రాలు తున్నాయి. పత్తి తడిసి ముద్దవడంతో తెల్లబంగారం కాస్తా నల్లబారింది. ఉన్న కొద్దిపాటి పత్తి తీద్దామంటే కూలీల కొరత వేధిస్తోంది. పత్తికి మద్దతు ధర ఉన్నప్పటికీ దిగుబడి లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడులైనా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

విశాలాంధ్ర బ్యూరో-గుంటూరు : ఆరుగాలం కష్టించి పత్తిసాగు చేసిన రైతులు నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. ఎడతెరిపి లేని వర్షాలు పత్తి పంటను ముంచుతూ కర్షకుడికి కన్నీటిని మిగుల్చుతోంది. ఆగస్టులో జిల్లావ్యాప్తంగా అత్య ధిక వర్షపాతం నమోదైంది. తాజాగా నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వానలు పత్తికి శరాఘాతంలా మారాయి. వీడకుండా రోజూ పడుతున్న వర్షంతో చేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఖరీఫ్‌ మొదట్లోనే బోరుబావుల కింద రైతులు పత్తిసాగు చేశారు. వర్షాలు పడనప్పటికీ ఉన్న బోరు నీటితోనే సర్దుకున్నారు. చేను ఏపుగా పెరిగినా బాగానే పడిరది. కానీ, గూడపగులుతున్న సమయంలోనే వరుస వర్షాలతో గూడ పూర్తిగా రాలిపోయింది. కొద్దిపాటి పత్తైనా తీద్దామనుకుంటే కూలీల కొరత వేధిస్తోందని రైతులు వాపోతున్నారు. మొత్తానికి ఈ ఏడాది పత్తిసాగు చేసిన రైతుల ఆశలు అడియాసలయ్యాయి. కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఏదేమైనప్పటికీ రైతు ఏటేటా ఏదోవిధంగా నష్టపోతూనే ఉన్నాడు. సాగు మొదట్లో వర్షాలు లేక ఇబ్బందులు పడిన రైతులు పత్తి తీసే సమయానికి రోజూ వర్షం కురుస్తుండడంతో చెట్టుమీదే పత్తి తడిసి నల్ల బారింది. తీసే పత్తిలోనూ గింజలు మొలకెత్తుతుండటంతో సిరులు కురిపిస్తుందనుకున్న తెల్లబంగారం తమను అప్పుల ఊబిలోకి నెట్టిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం రైతులు పత్తి సాగుపై ఆసక్తి చూపుతూ సాగు చేస్తున్నప్పటికీ వాతావరణం అనుకూలించక నష్టాలను చవిచూస్తున్నారు. వాస్తవానికి ఈ సీజన్‌లో సమయానికి వర్షాలు కురుశాయి. విత్తనాలు వేశారు. వరుణడు కరుణిం చడంతో చెట్టు ఏపుగా పెరిగింది. అంతా సరిగా ఉందను కుని.. కాయ మొత్తం పగిలి ఉన్న దశలో వరుస వర్షాలు నిరాశను మిగిల్చాయి. నెల రోజులుగా తడిసిన పత్తి ఆరలేదు. దీంతో తెల్లబంగారం నల్లగా మారింది. కాయలోనే గింజలు మొలకెత్తుతుండడంతో పత్తి దిగుబడి పూర్తిగా తగ్గి రైతులను నష్టాలు మూటగట్టుకునేలా చేసింది.
వర్షాలతో పత్తిపంటకు ముప్పు
వరుస వర్షాలతో పత్తిపంటలకు ముప్పు ఏర్పడు తోంది. వచ్చిన పూత రాలిపోతోంది. కొన్నిచోట్ల మొక్కపైనే పూత కుళ్లిపోతోంది. దీంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభా వం పడుతోంది. గుంటూరు జిల్లా మొత్తం మీద ఇప్పటి వరకు 28 మండలాల్లో అవసరానికి మించి వర్షం కురవగా 29 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్‌లో 86.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 81.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జులైలో 142.1 మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా 189.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఆగస్టులో 152 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 163.8 మిల్లీమీటర్లు కురిసింది. మొత్తంగా వర్షపాతం సాధారణంగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు సాగు మందగమనంగానే సాగింది. మొత్త 13 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా ఇప్పటి వరకు 6.20 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. మొత్తం విస్తీర్ణంలో 47 శాతం మేరకు సాగు జరిగిందని అధికారవర్గాలు తెలిపాయి. ఇందులో 2.20 లక్షల ఎక రాల్లో పత్తి, 2.50 లక్షల ఎకరాల్లో వరి, 45 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇతర పంటలు మరో 1.05 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. నెలాఖరు వరకు పత్తి సాగు, వచ్చే నెలాఖరు వరకు మిర్చి సాగుకు అవకాశం ఉంది. ఏటా పత్తి ధరలు నిలకడగా ఉండడంతో రైతులు ఈ ఖరీఫ్‌లో పత్తివైపే అధికంగా మొగ్గు చూపారు. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలతో ఒంపులో ఉన్న నేలలు జాలుపట్టి మొక్కలు ఎర్రబారుతున్నాయి.
ధర బాగున్నా దిగుబడితో దిగాలు
గతేడాది ఇదే సమయానికి మార్కెట్లో పత్తి క్వింటాకు సగటు ధర రూ.5075 నుంచి రూ.5500 వరకు ఉండగా ప్రస్తుతం క్వింటాకు రూ.6050 నుంచి రూ.6100 పలుకుతోంది. నవంబరు మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పత్తికొనుగోలు చేయాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది క్వింటాలు పత్తి ఎంఎస్పీ ధర రూ.6,025గా నిర్ణయించింది. కాగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 13 శాతం పంట విస్తీర్ణం తగ్గినట్లు సమాచారం. గతేడాది 5.66 లక్షల హెక్టార్లలో పంటవేయంగా, ఈ సంవత్సరం 4.86 లక్షల హెక్టార్లలో మాత్రమే పత్తి సాగు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆదోని, జమ్మికుంట, తెలంగాణలోని వరంగల్‌ మార్కెట్లలో క్వింటాలు పత్తి రూ.7500 నుంచి రూ.8 వేల వరకూ పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది దళారుల ప్రమేయం లేకుండా పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు పండిరచిన పంటలను పారదర్శకంగా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైతుల నుంచి సేకరించిన పత్తిని కొనుగోలు కేంద్రాల నుంచి కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కేంద్రాల వరకు సరఫరా చేసేందుకు రవాణా చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుండడం గమనార్హం. ఇందుకోసం గతేడాది రూ.86.62 లక్షలు ఖర్చు చేసింది. అదేరీతిలో ఈ ఏడాదీ ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది 11 ఏఎంసీలు, 73 జిన్నింగ్‌ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా పత్తి సేకరిస్తే ఈ ఏడాది 50 ఏఎంసీలు, 73 జిన్నింగ్‌ మిల్లుల వద్ద సేకరిస్తున్నారు. పత్తిని సేకరించే జిన్నింగ్‌ మిల్లుల సంఖ్యను మరింత పెంచాలని ప్రతిపాదనలు చేశారు. ఈ కేంద్రాల వద్ద దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మేలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా కోతకు వచ్చిన పత్తి సైతం తడిచిపోతుండడంతో తేమ అధికంగా ఉంటూ పత్తికి ధర రావడం లేదు. కొత్త పత్తి తేమశాతం 8 నుంచి 12 శాతం మధ్యన ఉంటే ప్రస్తుత మార్కెట్లో రూ.6100 ధర వస్తుంది. అధిక వర్షాలతో కొంతమేరకు పత్తి దిగుబడి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వ్యాపారవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img