Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

నిత్యావసర ధరల పెరుగుదలపై దద్దరిల్లిన అసెంబ్లీ

. సభ లోపలా, బయటా ప్రతిపక్ష సభ్యుల ఆందోళన
. స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి చర్చకు పట్టు
. టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు దద్దరిల్లాయి. వాడివేడిగా కొనసాగుతున్నాయి. తొలిరోజు గవర్నర్‌ ప్రసంగంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రతిపక్ష సభ్యులు రెండో రోజు మంగళవారం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై సభ లోపలా, బయటా ఆందోళన చేపట్టారు. ధరలను అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ప్ల కార్డులతో శాసనసభకు హాజరయిన తెలుగుదేశం పార్టీ సభ్యులు సమావేశం ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు వాయిదా తీర్మానం ఇచ్చారు. దానిని స్పీకర్‌ వెంటనే తిరస్కరిస్తూ సభా కార్యక్రమాలను ప్రారంభించడంతో వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు, మరోపక్క పన్నుల భారాలు, ఇంకోవైపు విద్యుత్‌, ఆర్టీసీ తదితర చార్జీల పెంపుతో సామాన్యుడు విలవిల లాడుతున్నాడని, శాసనసభలో ఇంతకంటే చర్చించడానికి ముఖ్యమైన అంశం ఏముంటుం దంటూ స్పీకర్‌ను వారు నిలదీశారు. స్పీకర్‌ వారి ఆందోళన లను పట్టించుకోకుండా టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు కొన్ని బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వైపు దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ బిగ్గరగా నినాదాలు చేశారు. స్పీకర్‌ చైర్‌ వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులు బాదుడే బాదుడు అంటూ నినా దాలు చేశారు. చేతుల్లోని అజెండా కాగితాలను చించి గాల్లోకి విసిరేశారు. మరోవైపు వైసీపీ సభ్యులు కూడా వారికి కౌంటర్‌గా నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు స్పీకర్‌ సస్పెండ్‌ చేయాల్సిందిగా కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. సస్పెన్షన్‌ తీర్మానాన్ని స్పీకర్‌ చదువుతున్న సమయంలో పోడియంపై ఉన్న టీడీపీ సభ్యులు ఈలలు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్‌ ఆదేశించినప్పటికీ వారు అక్కడి నుంచి కదలలేదు. దీంతో మార్షల్స్‌ రంగం ప్రవేశం చేసి వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో కూడా టీడీపీ సభ్యులు ఈలలు వేసుకుంటూనే బయటకు వెళ్లారు.
జగన్‌ను ప్రజలు సస్పెండ్‌ చేసే రోజు దగ్గర్లోనే:
బుచ్చయ్య చౌదరి, రామానాయుడు
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలపై సభలో చర్చ చేపడితే తన బాగోతం బయట పడుతుందన్న భయంతోనే ముఖ్యమంత్రి టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయించాడని టీడీపీ శాసనసభ్యులు ఆరోపించారు. స్పీకర్‌ వెన్నెముక లేకుండా వ్యవహరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చెప్పిందే తనకు వేదం అన్నట్టుగా సభను నడుపుతున్నారని విమర్శించారు. ప్రజల కోసం గొంతెత్తిన టీడీపీ సభ్యులను అన్యాయంగా సస్పెండ్‌ చేసిన ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రజలు త్వరలో రాష్ట్రం నుంచే సస్పెండ్‌ చేసే రోజు దగ్గర్లోనే ఉందని టీడీపీ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడు మీడియా ఎదుట విమర్శించారు. జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులకు ఎన్నిసార్లు సభలో మాట్లాడే అవకాశమిచ్చారు. ఎంత సమయం ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో మాట్లాడకుండా ఎన్నాళ్లు మా గొంతులు నొక్కేస్తారు? నాలుగు సంవత్సరాల 10 నెలల పాలనలో ఎన్ని నిమిషాలు టీడీపీ సభ్యులకు అవకాశమిచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన ధరల పెరుగుదల సమస్యలపై మాట్లాడకుండా మమ్మల్ని సభలో అడ్డుకుంటారా? వాటిని కూడా అణచివేస్తారా? అసెంబ్లీ ప్రాంగణంలో అన్ని వేల మంది పోలీసులను ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి అసెంబ్లీ వరకు కనీసం 4 వేల మంది పోలీసులున్నారని, ఇంత పిరికి సన్నాసి ముఖ్యమంత్రిని, ప్రజలకు భయపడే ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజలకు అంత బ్రహ్మాండంగా సేవలు అందించి, గొప్ప పాలన అందిస్తే ఇన్ని వేల మంది పోలీసులను జగన్‌మోహన్‌ రెడ్డి ఎందుకు కాపలా పెట్టుకుంటున్నాడో సమాధానం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img